IPL 2022- MS Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. రాబోయే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కలిసి నడువనున్నాడు. అదెలా అనుకుంటున్నారా..?
సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త.. టీమిండియా మాజీ సారథి, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. రాబోయే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కలిసి నడువనున్నాడు.
210
అదేంటి..? ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ధోని చెన్నై (మధ్యలో ఆ జట్టు మీద నిషేధం ఉన్నప్పుడు పూణెకు ఆడాడు) కే ఆడాడు. ఇతర జట్ల వైపు ధోని అసలు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ సీజన్ లో కూడా ధోని చెన్నైకే ఆడతాడు.
310
ఈ సీజన్ ప్రారంభంలో రెండు మ్యాచులు ఆడి ఐపీఎల్ నుంచి రిటైరయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ధోని సన్ రైజర్స్ లో పెట్టుబడులు పెట్టడమేంటని అనుకుంటున్నారా..?
410
అసలు విషయానికొస్తే.. ధోని పెట్టుబడులు పెట్టిన ఓ సంస్థ ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్ప్ హైదరాబాద్ కు ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తున్నది.
510
2015లో ప్రారంభమైన ‘కార్స్ 24’ సంస్థలో ధోని పెట్టుబడులున్నాయి. ఈ సంస్థ పేరే వచ్చే సీజన్ నుంచి ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై కనిపించనుంది. అంతకుముందు ‘జెకె లక్ష్మీ’ ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్ గా ఉంది. ఈ సీజన్ నుంచి దానిని కార్స్ 24 భర్తీ చేయనుంది.
610
కార్స్ 24తో పాటు ఈ డీల్ కు ఓఎల్ఎక్స్ ఆటోస్, స్పిన్నీ, కార్ దేఖో, కార్ ట్రేడ్ లు కూడా పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ అవకాశం కార్స్24కే దక్కింది.
710
గురుగ్రావ్ వేదికగా కార్యకాలాపాలు నడుపుతున్న ఈ సంస్థకు ధోనియే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లో ప్రతి ఏటా తాము లక్షా యాభై వేల దాకా కార్లను విక్రయిస్తున్నామని పేర్కొంది.
810
ఇదిలాఉండగా.. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు వచ్చే ఏడాదికి తమ జెర్సీ స్పాన్పర్స్ తో ఒప్పందాలు కుదర్చుకున్న విషయం తెలిసిందే.
910
నాలుగేండ్లుగా దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ తో ఉన్న అనుబంధాన్ని ముంబై ఇండియన్స్ తెంచుకుంది. ఆ స్థానాన్ని స్లైస్ (క్రెడిట్ కార్డు) భర్తీ చేయనుంది. మూడేండ్ల పాటు స్లైస్.. ముంబైకి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఇందుకుగాను రూ. 90 కోట్ల డీల్ కుదిరినట్టు సమాచారం.
1010
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా టీవీఎస్ యూరోగ్రిప్ తో మూడేండ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 100 కోట్లు కావడం గమనార్హం.