టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ సిబ్బందిలో భాగమైన అజిత్ అగార్కర్ కోరిక నెరవేరబోతుందా..? సెలక్షన్ కమిటీకి చీఫ్ గా ఉండాలని కోరుకుంటున్న అగార్కర్ ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకోబోతున్నట్టు టాక్. బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు.. చీఫ్ సెలక్టర్ రేసులో అజిత్ అగార్కర్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. వారం రోజుల క్రితం బీసీసీఐ.. చేతన్ శర్మ ఖాళీ చేసిన స్థానానికి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి జూన్ 30ను చివరి తేదీగా విధించింది.