Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే

Published : Jul 30, 2026, 09:50 PM IST

Ajinkya Rahane Net Worth: అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై చెప్పారు. భారత జట్టుకు అనేక విజయాలు అందించిన రహానే నెట్ వర్త్ ఎంతో తెలుసా? లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల ఇల్లు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
16
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సైలెంట్ హీరో

భారత క్రికెట్‌లో సూపర్ కూల్ ప్లేయర్, కష్టసమయాల్లో టీమ్‌ను ఆదుకునే ‘సైలెంట్ హీరో’ అజింక్య రహానే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 12 ఏళ్ల సుదీర్ఘమైన అద్భుతమైన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలుకుతూ, అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.

38 ఏళ్ల రహానే భారత్ తరఫున టెస్టూ, వన్డే, టీ20లు కలిపి మొత్తం 195 మ్యాచులు ఆడారు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనే ఆయన చివరిసారిగా టీమిండియా జెర్సీలో కనిపించారు. సరిగ్గా ఇదే సరైన సమయం అంటూ తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించారు.

26
5,000 ప్లస్ టెస్ట్ రన్స్.. బోర్డర్-గవాస్కర్ సిరీస్ మ్యాజిక్

2013 మార్చిలో ఢిల్లీలో ఆస్ట్రేలియాపై టెస్ట్ డెబ్యూ చేసిన రహానే, తన కెరీర్‌లో 85 టెస్టులాడి 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వేరే దేశాల్లోని కష్టమైన పిచ్‌లపై రహానే ఆడిన ఇన్నింగ్స్‌లు టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించాయి.

2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యాక, విరాట్ కోహ్లీ లేకపోవడంతో జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే.. మెల్‌బోర్న్ టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించి చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించారు. వన్డేల్లో 90 మ్యాచ్‌లలో 2,962 పరుగులు, టీ20ల్లో 20 మ్యాచ్‌లలో 375 పరుగులు చేశారు.

36
₹80 కోట్ల నెట్ వర్త్

మైదానంలో ఎంతో సాదాసీదాగా కనిపించే రహానే ఆర్థికంగా చాలా బలమైన పొజిషన్‌లో ఉన్నారు. మీడియా రిపోర్టుల ప్రకారం రహానే మొత్తం నెట్ వర్త్ సుమారు ₹80 కోట్లు ఉంటుంది. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ జీతాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన ఈ స్థాయి ఆస్తిని కూడబెట్టారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నప్పుడు బి-గ్రేడ్ కింద ఏడాదికి ₹3 కోట్ల రిటైనర్ ఫీజు తీసుకునేవారు.

ఐపీఎల్‌లో 6 విభిన్న ఫ్రాంచైజీలకు ఆడిన రహానే, కేవలం ఐపీఎల్ శాలరీ రూపంలోనే దాదాపు ₹54 కోట్లకు పైగా సంపాదించారు. గత ఐపీఎల్ సీజన్లలో కేకేఆర్ రూ. 1.5 కోట్లకు ఆయన్ను కొనుగోలు చేయగా, 2016-2018 మధ్యకాలంలో రూ. 8 కోట్ల నుంచి రూ. 9.5 కోట్ల వరకు దక్కించుకున్నారు.

46
అగ్రిటెక్, స్పోర్ట్స్ స్టార్టప్‌లలో పెట్టుబడులు

మైదానంలోనే కాదు, బయట బిజినెస్ విషయంలోనూ రహానే చాలా తెలివిగా అడుగులు వేశారు. వ్యవసాయదారులకు అవసరమైన యంత్రాలు, ఉత్పత్తులను అందించే 'మేరాకిసాన్' అనే అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్‌లో రహానే ఇన్వెస్ట్ చేశారు. దీనితో పాటు స్పోర్ట్స్ ఛానెల్స్ ను బుక్ చేసుకునే 'హడిల్' అనే స్పోర్ట్స్ టెక్ ప్లాట్‌ఫామ్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. చిన్నారుల కోసం రూపొందించిన 'క్రికెట్ పాంగ్' అనే యానిమేటెడ్ సిరీస్‌కు ఇన్వెస్టర్‌గా, క్యూరేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

56
రూ. 20 కోట్ల వర్త్ సీ-ఫేసింగ్ హౌస్.. లగ్జరీ కార్ల గ్యారేజ్

బాంద్రా-వోర్లి సీ లింక్, అరబిక్ సముద్రం కనిపించేలా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రహానేకు ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ ఇంట్లో ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, యూరోపియన్ తరహా ఇంటీరియర్స్‌తో పాటు ఆయన క్రికెట్ మైలురాళ్లను ప్రదర్శించే ప్రత్యేకం 'ట్రోఫీ వాల్' ఉంది. రహాణే కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన వద్ద రూ. 3 కోట్ల విలువైన 'మెర్సిడెస్-మేబాచ్ GLS 600' SUV ఉంది. దీంతో పాటు ఆడి Q5, బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ GT, రేంజ్ రోవర్, వోల్వో SUV వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయి.

66
ప్రతి బ్రాండ్‌కు రూ. 1 కోటి ఫీజు

రహాణే క్లీన్ ఇమేజ్, నమ్మకమైన ప్రవర్తన వల్ల ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఆయనతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపాయి. నైకీ, అడిడాస్, సీయెట్, బూస్ట్, హీరో మోటోకార్ప్, మై11సర్కిల్, గేమ్‌స్24x7, నియో గ్రోత్, ఎల్సా కార్ప్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి పలు దిగ్గజ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. రిపోర్టుల ప్రకారం, ఒక్కో బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ కోసం ఆయన దాదాపు రూ. 1 కోటి వరకు ఫీజు వసూలు చేస్తారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, ముంబై డొమెస్టిక్ టీమ్‌తో పాటు ఐపీఎల్‌లో ఆయన కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories