విరాట్ కోహ్లీకి ఆ విధంగా కూడా చెక్ పెట్టే యోచనలో బీసీసీఐ... రహానే, ఛతేశ్వర్ పూజారాలతో పాటు...

First Published Jan 21, 2022, 1:54 PM IST

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీని మూడు ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసిన భారత క్రికెట్ బోర్డు, ఇప్పుడు మరో ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో A+ కాంట్రాక్ట్ పొందుతున్న విరాట్ కోహ్లీ, ఈసారి దాన్ని కోల్పోబోతున్నట్టు సమచారం...

కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్న విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలకు A+ కేటగిరి కాంట్రాక్ట్ కింద రూ.7 కోట్లు వార్షిక వేతనంగా చెల్లిస్తోంది బీసీసీఐ... 

అయితే విరాట్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, బీసీసీఐకి కోహ్లీకి మధ్య సంబంధాలు ఏ మాత్రం సరిగా లేవని అర్థమయ్యేలా చేశాయి...

మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని, బీసీసీఐ కాంట్రాక్ట్‌ల్లోనూ A+ కేటగిరి నుంచి A కేటగిరికి మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం...

అలాగే గత ఏడాది కాలంగా టెస్టుల్లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలపై కూడా వేటు వేయలని చూస్తోందట భారత క్రికెట్ బోర్డు...

టెస్టుల్లో కీలక ప్లేయర్లుగా ఉండే ప్లేయర్లకు గ్రేడ్ A కేటగిరి కాంట్రాక్ట్ దక్కుతుంది. అయితే ఈ ఇద్దరి పర్ఫామెన్స్‌పై సంతృప్తిగా లేని బీసీసీఐ, వీరికి గ్రేడ్ Bకి మార్చాలని చూస్తోందట...

అలాగే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొంది, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్‌కి A+ కేటగిరి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది...

కెఎల్ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లకు కూడా A+ కాంట్రాక్ట్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది... 

గత ఏడాది A+ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా కాగా గ్రేడ్ A కాంట్రాక్ట్‌ పొందిన వారిలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పూజారా, రహానే, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. వీరికి ఏటా రూ.5 కోట్లు చెల్లిస్తుంది బీసీసీఐ. 

అలాగే వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌లకు గ్రేడ్ B కాంట్రాక్ట్ దక్కింది. వీరికి ఏటా రూ.3 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ...

కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ,  దీపక్ చాహార్, శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్‌లు C గ్రేడ్ కాంట్రాక్ట్‌లో ఉన్నారు. వీరికి ఏటా రూ. కోటి చెల్లిస్తోంది బీసీసీఐ...

click me!