రూ.18.5 కోట్లు పెట్టి కొన్నారు, ఏం లాభం! సరిగ్గా వాడుకోలేకపోయారు... సామ్ కుర్రాన్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published | Jun 4, 2023, 2:08 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లోనే కాదు, 16 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన క్రికెటర్ సామ్ కుర్రాన్. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సామ్‌ని రూ.18 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్....

Sam Curran

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సామ్ కుర్రాన్, 3 మ్యాచ్‌లకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 14 మ్యాచుల్లో బ్యాటుతో 276 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు...

సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబాడా వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నా పంజాబ్ కింగ్స్, 2023 సీజన్‌లో కూడా ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. గత నాలుగు సీజన్లలో ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్, ఈసారి 14 మ్యాచుల్లో 6 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది...


‘సామ్ కుర్రాన్‌, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్. అయితే అతని పర్ఫామెన్స్ ఎలా ఉంది. నా వరకైతే అతనికి పెట్టిన ధరలో సగం కూడా వర్కవుట్ అయినట్టు అనిపించలేదు. అంత పెట్టుబడి పెట్టి మట్టిలో పోసినట్టు అయింది...
 

నాకు తెలిసి వచ్చే సీజన్‌లో అతన్ని కచ్ఛితంగా విడుదల చేస్తుంది పంజాబ్ కింగ్స్. ఆ జట్టు ఎన్నో సీజన్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. మిగిలిన జట్లు, ఐపీఎల్ టైటిల్స్ గెలవకపోయినా కనీసం ప్లేఆఫ్స్‌కైనా వెళ్తున్నాయి, కానీ పంజాబ్ మాత్రం ఫ్లాప్ అవుతూనే ఉంది..

Image credit: PTI

టీమ్‌లో ఎవరు ఎక్కడ సెట్ అవుతారనే విచక్షణ లేకుండా పంజాబ్ కింగ్స్ టీమ్ సెలక్షన్ జరుగుతోంది. సామ్ కుర్రాన్ చాలా టాలెంటెడ్. అయితే అతనికి ఎంత పెట్టొచ్చనే విషయంలో పంజాబ్ కింగ్స్‌కి అవగాహన లేకపోయింది. అతన్ని వాడుకోవడంలోనూ ఫెయిల్ అయ్యింది..

సామ్ కుర్రాన్ ఓపెనింగ్ బౌలింగ్ చేయగలడు, కానీ భారత పిచ్‌ పరిస్థితులకు అతని బౌలింగ్ సెట్ అవుతుందా? సామ్ కుర్రాన్ కోసం అర్ష్‌దీప్ సింగ్‌ని పక్కనబెట్టారు.

Image credit: PTI

కగిసో రబాడాని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు... మొత్తానికి చాలామంది ప్లేయర్లు ఉన్నా, ఎవ్వరినీ సరిగ్గా వాడుకోలేకపోయారు.’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... 

Latest Videos

click me!