ఎంతకు తెగించార్రా.. ఆదుకుంటారనుకుంటే హ్యాండ్ ఇస్తారా..? శ్రీలంక బోర్డుపై పాక్ గుర్రు..!

First Published Jun 4, 2023, 1:40 PM IST

Asia Cup 2023:  ఆసియా కప్ వివాదంలో  కొత్త మలుపు.  ఈ టోర్నీని నిర్వహించాలని చూస్తున్న శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. 

సుమారు ఏడాదికాలంగా సా...గుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదంలో  కొత్త మలుపు.  ఈ టోర్నీని షెడ్యూల్ ప్రకారం  వచ్చే సెప్టెంబర్ లో  పాకిస్తాన్ లో నిర్వహించాలని   భావించినా   టీమిండియా ఇచ్చిన షాక్‌తో  టోర్నీ పాక్ నుంచి తరలిపోయే  స్థితికి వచ్చింది. 

అయితే భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదికపై  జరిపించినా మిగతా టోర్నీని మాత్రం ఇక్కడే నిర్వహిస్తామని   పీసీబీ పట్టుబడుతోంది. ఆ మేరకు ఇతర దేశాల మద్దతు కూడగడుతున్న పాకిస్తాన్ కు లంక ఇచ్చిన షాక్‌తో   పీసీబీకి దిమ్మ తిరిగింది. 

ఆసియా కప్‌ను శ్రీలంకలో నిర్వహించనున్నారనే వార్తల నేపథ్యంలో  పీసీబీ.. ఎస్ఎల్‌సీపై  అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది.  ఆసియా లో క్రికెట్ ఆడే దేశాలలో  పాకిస్తాన్ కు కాస్తో కూస్తో సత్సంబంధాలు ఉన్న దేశం  లంకనే. కానీ ఇప్పుడు లంక కూడా తమకు హ్యాండ్ ఇవ్వడం  పీసీబీ జీర్ణించుకోలేకపోతున్నది. 

ఇటీవలే ఐపీఎల్ -16  ఫైనల్  మ్యాచ్ చూసేందుకు గాను శ్రీలంక,  అఫ్గానిస్తాన్ బోర్డుల అధ్యక్షులు  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)అధ్యక్షుడు జై షా ను కలవడం.. అతడితో సమావేశమవడంపై పీసీబీ చీఫ్ నజమ్ సేథీ   అసంతృప్తిగా ఉన్నాడట. 

Image credit: Wikimedia Commons

ఈ క్రమంలో లంకకు షాకిచ్చేందుకు కూడా  పాకిస్తాన్ వెనుకాడటం లేదు. వాస్తవానికి  ఈ ఏడాది  పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 సీజన్‌లో తమ తొలి టెస్టును శ్రీలంకతోనే ఆడనుంది.  జులైలో  ఈ సిరీస్ మొదలుకావాల్సి ఉంది. టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడాలని లంక బోర్డు  ప్రతిపాదించింది. 

ఇప్పుడు  ఈ వన్డే ప్రతిపాదనను పీసీబీ తిరస్కరించినట్టు తెలుస్తున్నది.  వన్డేలతో పాటు టెస్టు మ్యాచ్ లు కూడా  జరుగుతాయా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది.  శ్రీలంకలో ఆసియా కప్ జరిగితే దాని ప్రభావం వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల పై కూడా  పడే అవకాశముంది. 

click me!