అందరి టార్గెట్ అదే... ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలను ఆకర్షించే పనిలో...

Published : Feb 08, 2022, 10:07 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. వేలంలో కోట్లు కొల్లగొట్టే కుర్రాళ్లు ఎవ్వరు, ఫ్రాంఛైజీల మధ్య పోటీపెట్టే ప్లేయర్లు ఎవరు అవుతారని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
18
అందరి టార్గెట్ అదే... ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలను ఆకర్షించే పనిలో...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలను ఆకట్టుకోవడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నారు అన్ని దేశాల క్రికెటర్లు...

28

తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ జాసన్ రాయ్, పాక్ సూపర్ లీగ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. పీఎస్‌ఎల్ 2022 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఆడుతున్నాడు జాసన్ రాయ్...

38

లాహోర్ గ్లారియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాసన్ రాయ్, 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగులు చేసి అదరగొట్టాడు...

48

క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జాసన్ రాయ్. రాయ్ సెంచరీ కారనంగా క్వెట్టా గ్లాడియేటర్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 205 పరుగుల టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది...

58

ఇంగ్లాండ్‌కి టీ20ల్లో ఓపెనర్‌గా ఉండే జాసన్ రాయ్‌, ఐపీఎల్ 2021 వేలంలో అమ్ముడుపోలేదు. అయితే గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న మిచెల్ మార్ష్ స్థానంలో జాసన్ రాయ్‌, ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు...

68

ఫస్టాఫ్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా... సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, సెకండ్ ఫేజ్‌లో పాల్గొనకపోవడంతో లక్కీగా జాసన్ రాయ్‌కి అవకాశం దక్కింది...

78

డేవిడ్ వార్నర్‌ను పక్కనబెట్టి జాసన్ రాయ్‌కి అవకాశం ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆడిన మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్న జాసన్ రాయ్, మెగా వేలానికి ముందు తానేం చేయగలడో పీఎస్‌ఎల్ ద్వారా ఫ్రాంఛైజీలకు చూపించాడు...

88

ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ వేలానికి ముందు రెచ్చిపోయి ఆడడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఐపీఎల్ 2021 వేలానికి ముందు భారత్‌తో జరిగిన టెస్టులో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది, ఫ్రాంఛైజీల కంట్లో పడ్డాడు మొయిన్ ఆలీ...  వేలంలో రూ.7 కోట్లు దక్కించుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories