Wanindu Hasaranga: టీమిండియాతో సిరీస్ కు ముందు లంకకు భారీ షాక్.. కీలక ఆటగాడికి కరోనా

Published : Feb 23, 2022, 01:43 PM IST

India Vs Srilanka T20 Series:  గురువారం లక్నో వేదికగా ప్రారంభం కాబోయే టీ20  సిరీస్ కు ముందే శ్రీలంకకు  ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  ఆ జట్టు ఆల్ రౌండర్.. 

PREV
17
Wanindu Hasaranga: టీమిండియాతో సిరీస్ కు ముందు లంకకు భారీ షాక్.. కీలక ఆటగాడికి కరోనా

టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు  శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఆల్ రౌండర్  వనిందు హసరంగ జట్టుకు  దూరమయ్యాడు. 

27

ఆస్ట్రేలియా పర్యటనలో కరోనా బారిన పడిన హసరంగ..  తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్  పరీక్షలో కూడా హసరంగకు మరోసారి పాజిటివ్ గా తేలింది. 
 

37

దీంతో టీమిండియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు అతడు దూరమయ్యాడు. టీ20లతో పాటు టెస్టులకు కూడా  హసరంగ అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది. 
 

47

ఆస్ట్రేలియా పర్యటన సమయంలో శ్రీలంక ఆటగాళ్లు కుశాల్ మెండిస్, భినుర ఫెర్నాండో లతో పాటు హసరంగ కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఈ ముగ్గురూ  ఆస్ట్రేలియాతో పలు  మ్యాచులకు దూరమయ్యారు. 

57

ఆసీస్ గడ్డ మీద లంకకు  ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 1-4 తేడాతో టీ20 సిరీస్ ను లంక కోల్పోయింది.  టీమిండియాతో అయినా రాణించి పరువు దక్కించుకోవాలని లంక  భావిస్తున్నది.  కానీ లంకకు మాత్రం వరుస షాక్ లు తగులుతున్నాయి. 

67
Srilanka t20

భారత్ తో పర్యటనకు గాను లంక జట్టును ఇదివరకే ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు.. 18 మందితో కూడిన ఈ జట్టు దసున్ శనక  సారథ్యం వహించనున్నాడు. 

77

శ్రీలంక జట్టు :  దసున్ శనక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషారా, జనిత్ లియాంగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, అషియన్ డేనియల్ 

Read more Photos on
click me!

Recommended Stories