మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్, తర్వాతి మ్యాచ్‌లో ఆడకపోతే... టీమిండియాపై కపిల్ దేవ్ ఫైర్...

First Published Jan 21, 2023, 9:36 AM IST

రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా, రోహత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఆటతీరులోనే కాదు, కల్చర్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రతీ సిరీస్ తర్వాత వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌ పేరుతో సీనియర్లకు రెస్ట్ ఇస్తున్న బీసీసీఐ, టీమ్ కాంబినేషన్‌ విషయంలోనూ రకరకాల ప్రయోగాలు చేస్తోంది...

Image credit: PTI

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత రెండో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి చోటు కల్పించింది టీమిండియా...

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడలేకపోయాడు...

బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాది ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వచ్చింది...

Suryakumar Yadav

‘టీమిండియా ఓ సెట్ ప్లేయర్లను ఫిక్స్ చేసుకోవాలి. వాళ్లకు వరుస అవకాశాలు ఇస్తూ రావాలి. ఇంతకుముందు కెప్టెన్లు ఇదే చేశారు. అవసరమైతే ఒకటి రెండూ మార్పులు చేయడంలో తప్పు లేదు...

Image credit: Getty

అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్, ఆ తర్వాతి మ్యాచ్‌లో రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తే.. క్రికెటర్లుగా టీమ్‌లో ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావడం లేదు... ఇది క్రికెట్ బోర్డుకి, సెలక్టర్లకే వదిలేయాలేమో...

Image credit: PTI

ఎంతో మంది క్రికెటర్లు వస్తున్నారు, అందరికీ అవకాశాలు దక్కాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే వచ్చిన ప్లేయర్లు, బాగా ఆడితే ఆ తర్వాతి మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకపోతే ఇక లాభం ఏంటి? మరి రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఏమనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి...
 

Image credit: PTI

టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరుగా మూడు జట్లను తయారుచేస్తే ఇంకా బాగుంటుందేమో చూడండి. అప్పుడు ఇలాంటి ప్రశ్నలే రావు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కూడా సెట్ అవుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్...

click me!