నీకు ఛాన్స్‌లు వచ్చేదే అమవాస్య, పౌర్ణమికి.. వాటిని కూడా ఇలా పాడు చేస్తే ఎలా సంజూ..? సన్నీకామెంట్స్

First Published Jan 4, 2023, 12:49 PM IST

INDvsSL Live: టాలెంట్  ఉన్నా టీమ్ లో ప్లేస్ దక్కడం లేదంటూ   సోషల్ మీడియాతో పాటు కేరళలో అభిమానులు చాలామంది సంజూ శాంసన్ కు మద్ధతుగా నిలుస్తారు.  

గతేడాది  టీమిండియాలో  చోటు దక్కించుకోవడానికి నానా తంటాలు పడి  ఆ తర్వాత చోటు దక్కినా బెంచ్ కే పరిమితమైన  ఆటగాళ్లలో సంజూ శాంసన్ ముందువరుసలో ఉంటాడు. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లకు అవకాశాలిచ్చిన టీమిండియా.. సంజూను మాత్రం బెంచ్ కే పరిమితం చేసింది. 
 

2022లో రోహిత్ గైర్హాజరీలో భారత్ చాలా మందిని  సారథులుగా మార్చింది. సిరీస్ కు ఒకరు అన్నట్టుగా  కెప్టెన్లు వచ్చారు వెళ్లారు.. కానీ ఎవరొచ్చినా   సంజూ మాత్రం బెంచ్ లోనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో   అతడి మద్దతుదారులు  సంజూ కోసం ఓ క్యాంపెయిన్ ను కూడా నడిపిస్తున్నారు.  దీంతో  దిగొచ్చిన బీసీసీఐ.. ఎట్టకేలకు శ్రీలంకతో  టీ20 సిరీస్ లో అతడిని ఆడిస్తున్నది. 

మంగళవారం ముగిసిన తొలి మ్యాచ్ లో  శాంసన్ కు   ఆడే అవకాశం వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు  క్రీజులోకి వచ్చిన సంజూ  కొద్దిసేపు క్రీజులో ఉన్నా బాగుండేది.  కానీ  ఆరు బంతులాడి  ఐదు పరుగులు చేసిన అతడు నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్లో నాలుగో బంతికి  క్యాచ్ మిస్ తో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా వాడుకోలేదు. 

అదే ఓవర్లో  తర్వాత బంతి శాంసన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి  మధుశనక  చేతిలో పడింది.  బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్ లో హార్ధిక్ పాండ్యా  వేసిన తొలి ఓవర్లో పతుమ్ నిస్సంక ఇచ్చిన  క్యాచ్ ను జారవిడిచాడు.  

అయితే సంజూ  వైఫల్యంపై  టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్  మాట్లాడుతూ.. ‘ఈసారి  బ్యాట్  ఎడ్జ్ కు తాకి  ఔటయ్యాడు.  సంజూ శాంసన్ మెరుగైన ఆటగాడు. అతడిలో చాలా టాలెంట్ ఉంది. కానీ అతడి షాట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్ గా లేదు. అదే అతడిని బెంచ్ మీద కూర్చోబెడుతున్నది. ఇలా విఫలమైన  ప్రతీసారి అతడిపై వేటు తప్పడం లేదు. మరోసారి అతడు తీవ్రంగా నిరాశపరిచాడు..’ అని అన్నాడు. 

ఇక శాంసన్ ఆటతీరుపై అతడి ఫ్యాన్స్ కూడా  నిరాశగా ఉన్నారు. ‘ఏందన్న  నువ్వు.. నీకు బీసీసీఐ ఛాన్సులిచ్చేదే అమవాస్య, పౌర్ణమికి.. దొరికిందే మహాభాగ్యం అనుకుని బాగా ఆడకుండా నువ్విలా విఫలమైతే ఎలా..?  ఓసారి లైఫ్ దొరికినా మళ్లీ అదే చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యావ్..’ అని వాపోతున్నారు. 

click me!