డబుల్ సెంచరీ కొట్టాడు సరే... సూర్య, రిషబ్ పంత్ వస్తే ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి?...

Published : Dec 11, 2022, 01:24 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత ఆఖరి వన్డేలో జూలు విదిల్చింది భారత జట్టు. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడి జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన  యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు...

PREV
18
డబుల్ సెంచరీ కొట్టాడు సరే... సూర్య, రిషబ్ పంత్ వస్తే ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి?...

85 బంతుల్లో సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, 102 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు. 126 బంతుల్లో డబుల్ సెంచరీ మార్కు అందుకుని.. అత్యంత వేగంగా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...

28
Image credit: PTI

వన్డేల్లో టీమిండియా తరుపున అత్యధిక స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషనే. బంగ్లాదేశ్‌లో ఇషాన్ కిషన్‌దే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2011లో షేన్ వాట్సన్ 185 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ రికార్డును తుడిచి పెట్టేశాడు ఇషాన్ కిషన్...

38
ishan

ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, బంగ్లాపై అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 2000వ సంవత్సరంలో 7 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో తొలి సెంచరీ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్... ఇంతకుముందు కపిల్ దేవ్ తొలి సెంచరీ చేసిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

48
ishan

103 బంతుల్లో 150 దాటిన ఇషాన్ కిషన్, అత్యంత వేగంగా 150+ బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ 112 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు... ఇన్ని రికార్డులు క్రియేట్ చేసినా ఇషాన్ కిషన్‌కి టీమిండియా తుది జట్టులో చోటు ఉంటుందని చెప్పలేని పరిస్థితి...

58

ఇషాన్ కిషన్‌తో కలిసి ఒకేసారి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి కీ పర్ఫామర్‌గా మారిపోయాడు. బంగ్లాదేశ్ టూర్‌ నుంచి సూర్యకి రెస్ట్ ఇచ్చింది టీమిండియా. ఓ రకంగా సూర్యకి రెస్ట్ ఇవ్వడం వల్లే ఇషాన్ కిషన్‌కి వన్డేల్లో ఛాన్స్ వచ్చింది...
 

68
rishabh pant

అలాగే వరుస సిరీస్‌లు ఆడుతూ బిజీగా గడిపిన రిషబ్ పంత్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కి కూడా ఎంపికయ్యాడు. అయితే సిరీస్ ఆరంభానికి ముందు రిషబ్ పంత్, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. రిషబ్ పంత్ ఉండి ఉంటే, ఇషాన్ కిషన్‌ మూడో వన్డేలో కూడా రిజర్వు బెంచ్‌లోనే కూర్చోవాల్సి వచ్చేది...

78

సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తే... ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తేవడం కష్టమైపోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వారి ప్లేసుల్లో ఫిక్స్ అయిపోయారు. కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని తప్పించలేని పరిస్థితి...

88
ishan

దీంతో ఎలా చూసినా డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా ఇషాన్ కిషన్‌, ఇంకొన్ని రోజులు రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి రావచ్చని భావిస్తున్నారు అభిమానులు. సౌతాఫ్రికా టూర్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి, ఇషాన్ కిషన్‌కి వరుస అవకాశాలు ఇచ్చేందుకు కూడా బీసీసీఐ, టీమిండియా సాహసం చేయకపోవచ్చని కామెంట్లు పెడుతున్నారు...

Read more Photos on
click me!

Recommended Stories