అనుష్క శర్మ కోసం రాహుల్ పేరుతో డ్రామా ఆడిన కోహ్లీ... విరాట్ మ్యారేజ్ సీక్రెట్స్ గురించి తెలిస్తే...

Published : Dec 11, 2022, 12:58 PM IST

21వ శతాబ్దంలోనూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అనేక ఇబ్బందులను, ఇక్కట్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  ఇవన్నీ మధ్యతరగతి వాళ్లకే వర్తిస్తాయి, డబ్బులు దండిగా ఉన్నవాళ్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటే పొరపాటే. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడానికి విరాట్ కోహ్లీ పేరు, వేషం అన్నీ మార్చుకోవాల్సి వచ్చిందట...

PREV
18
అనుష్క శర్మ కోసం రాహుల్ పేరుతో డ్రామా ఆడిన కోహ్లీ... విరాట్ మ్యారేజ్ సీక్రెట్స్ గురించి తెలిస్తే...

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ వరల్డ్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన పెళ్లాడాడు. పెళ్లి ఫోటోలను ఈ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేసేదాకా, వీళ్ల మ్యారేజ్ ఓ సీక్రెట్‌గానే ఉండింది...

28

2017, డిసెంబర్ 11న ఇటలీలోనీ ఓ విలసవంతమైన రిసార్టులో అతికొద్ది మంది ఆత్మీయులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ... టీమిండియా కెప్టెన్ పెళ్లికి భారత క్రికెటర్లు ఎవ్వరూ హాజరు కాలేదు... కోహ్లీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎంఎస్ ధోనీ కూడా ఈ వివాహానికి రాలేదు...

38

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢేటింగ్ చేస్తున్నాడని చాలా ఏళ్లు ప్రచారం జరిగింది. బహిరంగంగానే ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం చాలా సీక్రెట్‌గా జరిగింది...

48

కారణం ఇద్దరు సెలబ్రిటీ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటే అభిమానుల సందడి, మీడియా చేసే రాద్ధాంతం అంతా ఇంతా ఉండదు. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా ఆత్మీయుల మధ్య ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఈ ఇద్దరు...

58

పెళ్లిని సీక్రెట్‌గా ఉంచేందుకు ఏర్పాట్ల సమయంలో మారుపేర్లను వాడారట విరుష్క జోడి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే విరాట్ కోహ్లీ తన పేరుకి బదులుగా రాహుల్ అనే పేరుతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు...

68

అలాగే అనుష్క శర్మ పేరుకు బదులుగా ఐశ్వర్య అని వాడరట. అలా ఎంతో సీక్రెట్‌గా సదరు హోటల్ యాజమాన్యానికి కూడా జరగబోతున్నది భారత క్రికెట్ (ఇప్పుడు మాజీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి అని తెలియకుండా జాగ్రత్త పడ్డారట...

78

ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. ‘మేం పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేక్ నేమ్స్‌ని వాడాం. విరాట్ కోహ్లీ పేరు రాహుల్, నా పేరు ఐశ్వర్య...’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క...నేడు ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటోంది విరుష్క జోడి..

88

కరోనా లాక్‌డౌన్‌ని సరిగ్గా వాడుకున్న విరుష్క దంపతులకి, 2021 జనవరి 11న వామిక జన్మించింది. కూతురిని సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయం తీసుకున్న అనుష్క, విరాట్... ఆమె ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు... 

Read more Photos on
click me!

Recommended Stories