టీ20 వరల్డ్ కప్ తర్వాత కనిపించని ఆ ముగ్గురు... చాహాల్, హర్షల్ కెరీర్ ముగిసినట్టేనా...

First Published Dec 11, 2022, 10:58 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేయకపోవడం చాలా పెద్ద దుమారం రేపింది. అందుకే 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో వైట్ బాల్ క్రికెట్ టీమిండియా ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇచ్చారు సెలక్టర్లు. అయితే చాహాల్, పొట్టి ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

R Ashwin

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని అన్ని మ్యాచుల్లో ఆడిస్తూ వచ్చిన టీమిండియా, అతనితో పాటు అక్షర్ పటేల్‌కి నాలుగు మ్యాచుల్లో అవకాశం కల్పించింది. ఓ మ్యాచ్‌లో దీపక్ హుడా జట్టులోకి అలా వచ్చి ఇలా వెళ్లాడు...

Image credit: PTI

నాలుగేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. చాహాల్‌ని హానీమూన్‌కి తీసుకెళ్లినట్టుగా ఆస్ట్రేలియా తీసుకెళ్లి తీసుకొచ్చారు...

Image credit: Getty

యజ్వేంద్ర చాహాల్‌తో పాటు సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హర్షల్ పటేల్... భువీతో కలిసి ఓపెనింగ్ స్పెల్స్ వేస్తాడని, డెత్ ఓవర్లలో కీలక బౌలర్‌గా ఉంటాడని భావించారు... అయితే అలా జరగలేదు.

Harshal Patel

 గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన హర్షల్ పటేల్, కోలుకుని జట్టుకి అందుబాటులోకి వచ్చినా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీలను ఫాస్ట్ బౌలర్లుగా కొనసాగించింది భారత జట్టు...

Image credit: PTI

‘క్రికెట్‌ అనేది ఒక్క ప్లేయర్‌కి సంబంధించిన ఆట కాదు. టీమ్ కాంబినేషన్ చాలా అవసరం. అశ్విన్, అక్షర్ పటేల్ చక్కగా ఆడుతున్నప్పుడు నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడం పెద్ద షాకింగ్ విషయమేమీ కాదు. అయితే అవకాశం వచ్చినప్పుడు నా సత్తా నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా...

Chahal

రోహిత్ భాయ్, కోచ్ ద్రావిడ్ నాకు ఈ విషయాన్ని ముందుగానే చెప్పారు. టీమ్ కాంబినేషన్ కోసం ఎలాంటి ప్లేయర్‌ని అయినా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతామని తెలియచేశారు. 2019 వన్డే వరల్డ్ కప్ ఆడాను. ఆ తర్వాత రెండు వరల్డ్ కప్స్ (టీ20) ఆడలేకపోయాను...

Image credit: Getty

మళ్లీ వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తా. అయితే అది నా చేతుల్లో లేదు. తుది జట్టులో రావడానికి నేను చేయాల్సింది నన్ను నేను నిరూపించుకుంటూ ఉండడమే... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్...

యజ్వేంద్ర చాహాల్, హర్షల్ పటేల్‌తో పాటు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన తర్వాత భారత జట్టుకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన దినేశ్ కార్తీక్, సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు...

click me!