టీమిండియా కొంపముంచిన ఆ ఇద్దరి గాయాలు... కెఎల్ రాహుల్ పరమ జిడ్డు బ్యాటింగ్‌కి...

First Published Nov 20, 2023, 10:17 AM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే ఫైనల్‌లో మాత్రం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఫెయిల్ అవ్వడంతో 6 వికెట్ల తేడాతో ఓడి మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..

ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 81 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ కలిసి కేవలం 4 బౌండరీలు మాత్రమే చేయగలిగారు.. ఇదే టీమిండియా కొంపముంచింది..
 

ఆస్ట్రేలియా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ట్రావిస్ హెడ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి బౌండరీలు బాదాడు. భారత బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్ మాత్రం ఒక్క షాట్ ఆడేందుకు భయపడుతూ, ‘అతి’ జాగ్రత్తగా ఆడాడు..
 

ఓ రకంగా భారత జట్టు ఓటమికి ఈ జిడ్డు బ్యాటింగే కారణం. రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు ఒకే ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్ అవుట్ అయ్యాక ఒక్క బౌండరీ కొట్టడానికి సాహసించలేదు.

KL Rahul

హాఫ్ సెంచరీ తర్వాత స్కోరు వేగం పెంచాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపించిన కోహ్లీ, కీలక సమయంలో అవుట్ కావడంతో మ్యాచ్‌పై ఆసీస్ పట్టు సాధించింది..

Virat Kohli-Ravindra Jadeja

కెఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌కి కారణం ఉంది. ఎందుకంటే తాను అవుటైతే తర్వాత వచ్చేది సూర్యకుమార్ యాదవ్‌. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా, ఏదో టీ20 నెం.1 ర్యాంకు కోటాతో వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్నాడు. అతన్ని నమ్మి ఫ్రీగా ఆడడం రిస్కే..

Jadeja-Kohli

అదీకాకుండా హార్ధిక్ పాండ్యా గాయంతో టీమ్‌కి దూరం కావడం, భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. హార్ధిక్ పాండ్యా ఉండి ఉంటే, ఓ ఎండ్‌లో కెఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ చేసినా మరో ఎండ్‌లో బౌండరీలు వచ్చేవి...

రిషబ్ పంత్ జట్టుకి అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఓ రకంగా రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా లేని లోటు, వరల్డ్ కప్ లీగ్ స్టేజీలో ఎక్కడా కనిపించకపోయినా ఫైనల్ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.

వాళ్లు ఉండి, ఇదే రిజల్ట్ వచ్చి ఉంటే ఏమో కానీ... లేకపోవడం వల్ల ఉంటే గెలిచేవాళ్లమేమో అనే ఆలోచన అందరిలోనూ మెదులుతోంది.. 

click me!