Kapil Dev: రోహిత్ శ‌ర్మ‌ పై అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్న కపిల్ దేవ్ ఆసక్తికర పోస్ట్..

First Published Nov 21, 2023, 2:03 AM IST

Rohit Sharma: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఫైన‌ల్ లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో ఓట‌మి తో నిరాశలోకి జారుకున్న ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కు యావ‌త్ భార‌తావ‌ని అండ‌గా నిలుస్తోంది. ఈ క్ర‌మంలోనే  ప్రపంచ క‌ప్ విజేత భారత జ‌ట్టు కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
 

ICC Cricket World Cup 2023: ఐసీసీ మెగా ఈవెంట్ లో తాజా వైఫల్యం తర్వాత టీమ్ ఇండియా సమాధానాల కోసం వెతుకుతున్న నేపథ్యంలో.. 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తన మద్దతును అందించాడు.
 

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఎడిషన్‌లో భార‌త్ రాబిన్ రౌండ్ నుంచి సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు తిరుగులేని విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరుకుంది. మెగా టోర్నీలో వ‌రుసగా 10 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్ చేరుకున్న భార‌త్ జ‌ట్టుకు చివ‌రి మ్యాచ్ లో అత్యంత బాధ‌క‌ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటూ.. పాట్ కమిన్స్ సార‌థ్యంలోని ఆస్ట్రేలియా టీమ్ చేతితో భారత్‌కు ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చ‌విచూసింది.
 

ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమ్ మొత్తం నిరాశకు గురైంది. రోహిత్ శ‌ర్మ ఏకంగా ఓటమి బాధ‌తో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఓట‌మితో వెనుక‌డుగు వేయ‌వ‌ద్ద‌నీ, మున్ముందు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని అభిప్రాయ‌ప‌డుతూ భారత ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ క‌పిల్ దేవ్.. రోహిత్ శ‌ర్మ‌కు ఓ సలహా ఇచ్చి అందరి హృదయాలను గెలుచుకున్నారు. 
 

రోహిత్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ లో వరుసగా 10 మ్యాచ్ లు గెలిచింది. ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ చేయలేని రికార్డును సృష్టించాడు. ఎందుకంటే భారత్ రెండుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు గ్రూప్ దశలో ఓట‌ముల‌ను చ‌విచూసింది. కానీ రోహిత్ నాయకత్వంలో భారత్ చరిత్ర సృష్టించింది. కానీ భారత జట్టు ప్రపంచకప్ గెలవలేకపోయింది. దీంతో రోహిత్ కు నిరాశే ఎదురైంది. అయితే ఆ తర్వాత కపిల్ దేవ్ సోషల్ మీడియాలో  చేసిన ఒక పోస్ట్ వైర‌ల్ గా మారింది.
 

ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమనీ, ఈ విషయం తనకు తెలుసునని కపిల్ దేవ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. "కానీ మీలో స్ఫూర్తిని అలాగే ఉంచండి. ఎందుకంటే రోహిత్, ప్రపంచకప్ లో నువ్వు చేసినది అత్యుత్తమంగా ఉంది. నిరుత్సాహపడకండి, ఎందుకంటే మీరు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. యావత్ భారతావని నీ వెనుకే ఉందని" పేర్కొన్నారు. ప్రస్తుతం కపిల్ దేవ్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
 

ఒక కెప్టెన్ మాత్రమే మరో కెప్టెన్ భావాలను అర్థం చేసుకోగలడు. కాబట్టి భారత్ ఓటమి తర్వాత రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ చేసిన పోస్ట్ కచ్చితంగా స్ఫూర్తిదాయకం. 'రోహిత్, నిరాశ చెందకండి, మీరు ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది' అని కపిల్ అన్నారు. ఈ భారీ ఓటమి తర్వాత ఆశలు రేకెత్తించే కపిల్ ప్రకటన ఇది. కాబట్టి రోహిత్ మళ్లీ ఎలా ఉంటాడనే దానిపైనే అందరి దృష్టి ఉంటుంది.
 

కాగా, ఐసీసీ ఈవెంట్ లో రోహిత్ మ‌రో రికార్డు సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ రెండు ఎడిషన్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత 500కు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 54.27 యావరేజితో బరిలోకి దిగిన ఈ వెటరన్ ఓపెనర్ 11 మ్యాచ్ ల‌లో 597 పరుగులు చేశాడు.
 

అలాగే, ఐసీసీ వరల్డ్ కప్ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీతో సహా ఆరుగురు భారత ఆటగాళ్లు ఐసీసీ వరల్డ్ కప్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నారు. వారిలో కేఎల్ రాహుల్, బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజాలు ఉన్నారు. 

click me!