మొన్న ఇయాన్ మోర్గాన్, నేడు బెన్ స్టోక్స్... ఇంగ్లాండ్ స్టార్స్ సెడన్ రిటైర్మెంట్‌కి కారణాలేంటి...

Published : Jul 18, 2022, 06:29 PM IST

క్రికెట్‌కి పుట్టినిల్లు అయినప్పటికీ ఇంగ్లాండ్‌కి వన్డే వరల్డ్ కప్ సాధించడానికి 100 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఎందరో దిగ్గజాలు చేయలేకపోయిన పనిని ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని టీమ్ 2019లో సాధించి చూపించింది. అయితే తీవ్ర వివాదాస్పదమైన ఈ వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ప్రధాన ప్లేయర్లు రెండు వారాల వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
18
మొన్న ఇయాన్ మోర్గాన్, నేడు బెన్ స్టోక్స్... ఇంగ్లాండ్ స్టార్స్ సెడన్ రిటైర్మెంట్‌కి కారణాలేంటి...
Eoin Morgan

టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆరంభానికి ముందు పేలవ ఫామ్, గాయాల కారణంగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

28
Ben Stokes

ఇంగ్లాండ్‌కి 2019 వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తే... భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడిన తర్వాత బెన్ స్టోక్స్, వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

38
Dhoni and Morgan

ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్‌కి ఏడాదిన్నర పాటు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్ ఆరంభంలో చూపించిన దూకుడు కొనసాగించలేకపోయిన మోర్గాన్, గాయలతో సతమతమవుతూ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.. 

48

తాజాగా బెన్ స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణం. గాయాల కారణంగా ఐపీఎల్‌కి కూడా దూరమయ్యాడు బెన్ స్టోక్స్. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడి గాయంతో స్వదేశానికి వెళ్లిన బెన్ స్టోక్స్, మెంటల్ రిలీఫ్ కోసం కొన్ని నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...

58

భారత జట్టు వారం తీరిక లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతోంది. అయితే ఆటగాళ్లు అలిసిపోయే రెస్ట్ అండ్ రిప్లేస్ ఫార్ములా ఫాలో అవుతోంది టీమిండియా. భారత జట్టు కంటే ఇంగ్లాండ్ జట్టు షెడ్యూల్ మరింత బిజీబిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఏడాదిలో అత్యధిక టెస్టులు ఆడే జట్టు ఇంగ్లాండే...

68

ben stokes

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇప్పటికే 16 టెస్టు మ్యాచులు ఆడే ఇంగ్లాండ్, వచ్చే ఏడాదిన్నరలో మరో 16 టెస్టులు ఆడనుంది. వన్డే, టీ20 సిరీస్‌లు, ఐపీఎల్, ది హండ్రెడ్ వంటి లీగులు అదనం...

78

నిన్న టీమిండియాతో వన్డే సిరీస్ ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు, రేపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. అంటే మధ్యలో వారికి ఉన్న విరామ సమయం ఒకే ఒక్క రోజు... 

88
Eoin Morgan

భారత జట్టు ప్లేయర్లు విశ్రాంతి పేరుతో మూడు మ్యాచులు ఆడుతూ మూడు మ్యాచులకు దూరంగా ఉంటున్నారు. ఇంగ్లాండ్‌లో ఇలా రెస్ట్ పేరు చెప్పి బ్రేక్ తీసుకునే వెసులుబాటు లేదు...  అందుకే క్రేజ్ ఉన్న టీ20ల్లో, కెప్టెన్సీ దక్కిన టెస్టుల్లో కొనసాగాలని నిర్ణయించుకున్న బెన్ స్టోక్స్... వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!

Recommended Stories