నేను గంటసేపు మోటివేషన్ ఇస్తే సెంచరీ కొట్టేశావ్... రిషబ్ పంత్ సెంచరీ క్రెడిట్ కొట్టేసిన యువీ...

Published : Jul 18, 2022, 05:01 PM IST

టీమిండియాలోకి వచ్చే యంగ్ ప్లేయర్లకు అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటాడు భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ఐపీఎల్‌లో అదరగొడుతున్న శుబ్‌మన్ గిల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మలకు మెంటర్‌గా ఉన్నాడు యువరాజ్ సింగ్...

PREV
18
నేను గంటసేపు మోటివేషన్ ఇస్తే సెంచరీ కొట్టేశావ్... రిషబ్ పంత్ సెంచరీ క్రెడిట్ కొట్టేసిన యువీ...

టెస్టుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ కీలక సభ్యుడిగా మారిపోయినా వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ పర్పామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు రిషబ్ పంత్...

28

తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 72 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాని ఆపద్భాంధవుడిగా ఆదుకున్నాడు రిషబ్ పంత్. హార్ధిక్ పాండ్యాతో కలిసి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు...

38

ఇంతకుముందు టీ20, వన్డేల్లో దూకుడుగా ఆడాలని చెత్త షాట్లు ఆడే ప్రయత్నం చేయకుండా నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించిన రిషబ్ పంత్... సెంచరీ పూర్తి చేసుకునేందుకు 105 బంతులను తీసుకున్నాడు...

48

సెంచరీ తర్వాత దూకుడు పెంచి ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదిన రిషబ్ పంత్, విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్‌ని, సిరీస్‌ని ముగించి... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..

58

‘చూస్తుంటే నీకు ఇచ్చిన 45 నిమిషాల మోటివేషన్ బాగానే వర్కవుట్ అయినట్టుంది... బాగా ఆడావ్ రిషబ్ పంత్! నువ్వు ఇన్నింగ్స్ నిర్మించే విధానం ఇది.. హార్ధిక్ పాండ్యా చూడచక్కగా ఆడావు... ’ అంటూ నవ్వుతున్న ఏమోజీలను పోస్ట్ చేశాడు యువరాజ్ సింగ్...

68
Image credit: PTI

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిషబ్ పంత్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎమ్మెస్ ధోనీని సెలక్ట్ చేయకుండా రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

78
Image credit: PTI

‘రిషబ్ పంత్ ఇన్ని సార్లు అవుట్ అవ్వడం ఎన్ని సార్లు చూశాం.. ఇందుకే అన్ని టీమ్‌కి సెలక్ట్ చేయలేదేమో...  బాధాకరం...’ అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్‌, 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ట్వీట్ చేశాడు..

88

ఈ ట్వీట్‌కి స్పందించిన యువరాజ్ సింగ్... ‘అతను ఇప్పటిదాకా ఆడింది 8 వన్డేలే. అది అతని తప్పు కాదు, అతను నేర్చుకుంటాడు. కాబట్టి కాస్త సమయం ఇవ్వండి. ఇందులో బాధకరమైన విషయం ఏమీ లేదు. అయితే మనందరికీ అభిప్రాయాలను పంచుకునే హక్కు ఉంది..’ అంటూ రిప్లై ఇచ్చాడు...

Read more Photos on
click me!

Recommended Stories