ఇన్ని వేల కోట్లున్నాయి, ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని తయారుచేయలేరా... టీమిండియాకి శాపంగా మారిన...

Published : Jul 18, 2022, 04:28 PM IST

భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్...ఇలా వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు కొదువే లేదు. అయితే అందరికీ ఒకటే బలహీనత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్‌ను ఫేస్ చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతారు భారత టాప్ ఆర్డర్...

PREV
19
ఇన్ని వేల కోట్లున్నాయి, ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని తయారుచేయలేరా... టీమిండియాకి శాపంగా మారిన...
Shaheen Afridi-Virat Kohli

భారత టాపార్డర్‌కి ఉన్న ఈ బలహీనత కారణంగానే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మహమ్మద్ అమీర్‌ని, 2021 టీ20 వరల్డ్ కప్‌లో షాహీన్ ఆఫ్రిదీని అస్త్రంగా వాడి... విజయాలు అందుకుంది పాకిస్తాన్...

29

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో కూడా భారత జట్టును ఇదే బలహీనత వెంటాడింది. టాపార్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్... ఇంగ్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రీస్ టాప్లీని ఫేస్ చేయడానికి తెగ ఇబ్బంది పడి స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు...
 

39

భారత బ్యాటర్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఫేస్ చేయడానికి ఇంత ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం భారత జట్టులో కొన్నేళ్లుగా సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడమే...

49

ఇంతకుముందు జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్.. భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లుగా ఉండేవాళ్లు. వీరి బౌలింగ్‌ని నెట్స్‌లో ఎదుర్కొవడంతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్... వంటి భారత మాజీ క్రికెటర్లు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందిపడేవాళ్లు కాదు..

59

అయితే జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా రిటైర్మెంట్ తర్వాత సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని తయారుచేయలేకపోయింది బీసీసీఐ. కొన్నాళ్లు నటరాజన్, ఆశలు రేపినా... అతను గాయపడుతూ ఫిట్‌నెస్ లోపంతో జట్టుకి పెద్దగా అందుబాటులో ఉండడం లేదు...

69

ఆ తర్వాత ఖలీల్ అహ్మద్, జయ్‌దేవ్ ఉనద్కడ్ వంటి ప్లేయర్లు ఆశలు రేపినా పెద్దగా సక్సెస్ సాధించలేక జట్టుకి దూరమయ్యారు. ఇప్పుడు భారత జట్టు ఆశలన్నీ అర్ష్‌దీప్ సింగ్‌పైనే పెట్టుకుంది...

79
Arshdeep Singh

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడే అర్ష్‌దీప్ సింగ్, తన అంతర్జాతీయ కెరీర్‌ని మెయిడిన్ ఓవర్‌తో మొదలెట్టాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్‌కి అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు...

89

వేల కోట్లు ఆర్జిస్తూ, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా గుర్తింపు తెచ్చుకున్న భారత క్రికెట్ బోర్డు... జట్టుకి అవసరమైన ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని తయారుచేయలేకపోవడం ఫ్యాన్స్‌ని తీవ్రంగా కలవరబెడుతోంది...

99

అనవసర రాజకీయాలతో సిరీస్‌కో కెప్టెన్‌ని మారిచే బదులు, ఐపీఎల్‌లో దొరికిన ఆణిముత్యాలను సరిగ్గా వాడుకోవడంపై దృష్టి పెడితే భారత జట్టు భవిష్యత్తు బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

click me!

Recommended Stories