ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేశాడు.. ఐపీఎల్‌కు వస్తాడా..? పుజారాపై టీమిండియా వికెట్ కీపర్ కామెంట్స్

First Published Dec 17, 2022, 1:05 PM IST

BANvsIND: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మిస్టర్ డిపెండెబుల్ ఛతేశ్వర్ పుజారా  తన కెరీర్ లో మూడున్నరేండ్ల తర్వాత  సెంచరీ చేశాడు.  తొలి ఇన్నింగ్స్ లో మిస్ అయినా రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదాడు పుజారా. 

2019  జనవరి తర్వాత  మళ్లీ  మూడంకెల స్కోరు చేసిన ఛతేశ్వర్  పుజారా తన కెరీర్ లోనే అత్యంత  వేగంగా  సెంచరీ చేశాడు.   బంగ్లాదేశ్ తో  జరుగుతున్న తొలిటెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో పది పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న పుజారా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా  ఆడాడు. 

రెండో ఇన్నింగ్స్ లో  పుజారా.. 130 బంతుల్లో సెంచరీ చేశాడు. తన అంతర్జాతీయ  క్రికెట్ కెరీర్ లో పుజారా ఇన్ని తక్కువ బంతులలో సెంచరీ  చేయడం ఇదే ప్రథమం. అతడికి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.  తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసిన  పుజారా.. రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

పుజారా సెంచరీ తర్వాత  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్   ఈ సౌరాష్ట్ర బ్యాటర్ పై ప్రశంసలు కురిపించాడు. పుజారా ఐపీఎల్ కెరీర్ గురించి  కార్తీక్ మాట్లాడాడు.  క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కార్తీక్ మాట్లాడుతూ..  ‘వాస్తవంగా చెప్పాలంటే  పుజారా ఐపీఎల్ కు వస్తాడని నేనైతే అనుకోవడం లేదు.  గతంలో పలుమార్లు ఐపీఎల్ ఆడేందుకు యత్నించాడు.. 

అయితే   ఈ తరహా క్రికెట్ తనకు సూట్ కాదని పుజారా రియలైజ్ అయ్యాడు.  అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించడు. ఈ ఏడాది చాలాకాలం పుజారా ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సమయం వెచ్చించాడు. ఇండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉంటే   పుజారా మాత్రం  తన స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. 

ఈ వయసులో పుజారా ప్రత్యేకించి నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. మనం ఎక్కడ ఆటను ఆస్వాదిస్తున్నామనేదే   ముఖ్యమైనది. ఇంగ్లాండ్ లో కౌంటీ ఆడుతూ తన కుటుంబాన్ని కూడా అక్కడికే తీసుకెళ్లాడు పుజారా. అందుకే అతడు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు..’ అని చెప్పాడు. 

ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా.. కౌంటీలకు ఆడాడు.  కౌంటీలలో సస్సెక్స్ తరఫున ఆడిన నయా వాల్.. 8 మ్యాచ్ లలో 1,094 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.  కౌంటీ డివిజన్ 2 ఛాంపియన్షిప్ లో  మెరుపులు మెరిపించిన పుజారా..

click me!