శుబ్‌మన్ గిల్ సెంచరీతో టీమిండియాకి కొత్త తలనొప్పి... రోహిత్ వస్తే ఎవరిని పక్కనబెట్టాలబ్బా...

First Published Dec 16, 2022, 5:04 PM IST

బంగ్లాదేశ్‌ టూర్‌లో తొలి రెండు వన్డేల్లో ఓడినా ఆ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకి దూరమైన తర్వాత కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో మూడో వన్డేలో ఘన విజయం అందుకుంది. తొలి టెస్టులోనూ తిరుగులేని ఆధిక్యం సాధించి, బంగ్లా ముందు 513 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టింది... 

రెండో వన్డేలో గాయపడి రోహిత్ జట్టుకి దూరం కావడంతో అతని ప్లేస్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో ఇప్పటికే రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయడానికి చాలా పోటీ ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో ఇషాన్ కిషన్ కూడా చేరిపోయాడు...

gill

తాజాగా రోహిత్ స్థానంలో తుది జట్టులోకి వచ్చి కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు శుబ్‌మన్ గిల్. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే అవుటైన శుబ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ అవుటైనా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. రోహిత్ రీఎంట్రీ ఇస్తే శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టేవాళ్లు...

Pujara-Gill

అయితే రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ టాప్ క్లాస్ పర్పామెన్స్‌తో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కి 70 పరుగులు, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

KL Rahul

రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ, రెండో టెస్టులో ఆడబోతున్నాడు. ఇప్పుడు రోహిత్ ఎవరి ప్లేస్‌లో ఆడాలనేది త్రిబుల్ సెంచరీ ప్రశ్నగా మారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీమిండియా వైస్ కెప్టెన్ కాబట్టి కెఎల్ రాహుల్‌ని తప్పించలేని పరిస్థితి...

Image credit: Getty

ఒకవేళ టూ డౌన్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తప్పించాలంటే... అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అదీకాకుండా ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. టీ20ల్లో, వన్డేల్లో సెంచరీలు బాదాడు...
 

Rishabh Pant-Pujara

ఛతేశ్వర్ పూజారా తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఫామ్‌ నిరూపించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ చేసిన 46 పరుగులు ఎంతో అమూల్యమైనవి...

దీంతో రెండో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ బ్యాటర్ స్థానంలో రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎప్పటిలాగే రోహిత్‌ని టీమ్‌లోకి తెచ్చేందుకు కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరిని గాయం వంకతో తుది జట్టు నుంచి తప్పంచడమే జరుగుతుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.. 
 

click me!