నా కొడుకు పెద్దగా సక్సెస్ కాలేడు! అతనిలాగే అవుతాడు... సచిన్ టెండూల్కర్ కామెంట్...

First Published Dec 17, 2022, 10:53 AM IST

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, 100 సెంచరీలతో రికార్డులతో ఓ పెద్ద పుస్తకాన్నే నింపేశాడు. సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, గోవా తరుపున ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చాడు.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు...

Arjun Tendulkar

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా తరుపున ఆడిన అర్జున్ టెండూల్కర్ 207 బంతుల్లో 120 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రంజీ ఆరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయిన అర్జున్ టెండూల్కర్, 34 ఏళ్ల తర్వాత తండ్రి ఫీట్‌ని రిపీట్ చేశాడు. 

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్న ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, 1988 డిసెంబర్ 11న రంజీ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేయగా... 2022 డిసెంబర్ 14న అర్జున్ టెండూల్కర్ ఇదే ఫీట్ రిపీట్ చేశాడు...

మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ వయసు 15 ఏళ్లు కాగా ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, రంజీ ఆరంగ్రేటం చేసేందుకు 23 ఏళ్ల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని అందుకున్న అర్జున్ టెండూల్కర్, సుయాష్ ప్రభుదేశాయ్‌తో కలసి ఆరో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు...

arjun


‘సచిన్ టెండూల్కర్ కొడుకుగా అర్జున్ టెండూల్కర్‌కి బాల్యంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అతన్ని ఓ క్రికెటర్ కొడుకుగానే చూసేవాళ్లు. ఎక్కడికెళ్లినా మీడియా అతన్ని వెంటాడేది.. అందుకే నేను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక అర్జున్‌ని వదిలేయాల్సిందిగా మీడియాని వేడుకున్నాను...

అర్జున్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా ప్రమేయం లేకుండా అతని అవకాశాలను అతనే దక్కించుకున్నాడు. అతనిపై మేం ఎప్పుడూ ప్రెషర్ పెట్టలేదు. నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చారు. అర్జున్‌కి కూడా నేను అదే స్వేచ్ఛ ఇచ్చాను...

సచిన్ కొడుకు అనగానే అర్జున్‌పై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. నేను సచిన్ తండ్రిని అని చెప్పుకోవడానికి మా నాన్న చాలా గర్వపడేవారు. కొడుకు వల్ల గుర్తింపు తెచ్చుకోవడం చాలా స్పెషల్ ఫీలింగ్... 

అయితే నా బిడ్డకు అలాంటి అనుభవాన్ని ఇవ్వలేకపోయాను. అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో ఎదగలేడని నాకు తెలుసు, అతను రోహాన్ గవాస్కర్‌లా అవుతాడని అనుకుంటున్నా... సక్సెస్ అయితే అదే హ్యాపీ...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్... 

click me!