ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఐపీఎల్‌కి దూరమైన రిషబ్ పంత్!... వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కి కష్టమేనంటూ...

First Published Dec 31, 2022, 11:13 AM IST

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. అతను వేగంగానే కోలుకుంటున్నాడని, స్పృహలోకి వచ్చి మాట్లాడాడని కూడా వైద్యులు తెలిపారు. తాజాగా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని వివరాలు బయటికి వచ్చాయి..

ప్రస్తుతం రిషబ్ పంత్ తల్లి సరోజ్ పంత్, ఐసీయూలో ఉండి కొడుకుని దగ్గరుండి చూసుకుంటున్నారు. మ్యాక్స్ ఆసుపత్రిలో అర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన డాక్టర్ గౌరవ్ గుప్తా, రిషబ్ పంత్‌కి చికిత్స అందిస్తున్నాడు...

Rishabh Pant

‘రిషబ్ పంత్‌కి అయిన గాయాలు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల వరకూ సమయం పడుతుంది. కొన్నాళ్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. రిషబ్ పంత్ ఎంత వేగంగా కోలుకుంటాడనేది అతని మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది..’ అంటూ తెలిపారు వైద్యులు...

Latest Videos


శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రిషబ్ పంత్‌కి చోటు దక్కలేదు. వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌కి టీమ్‌లో ఎందుకు చోటు ఇవ్వలేదనే విషయంపై చాలా పెద్ద చర్చే జరిగింది. రిషబ్ పంత్ బ్రేక్ కావాలని బీసీసీఐ అధికారులను కోరాడని తెలిసింది...
 

Rishabh Pant-Pujara

శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడే భారత జట్టు... ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా గెలవడం చాలా అవసరం...

rishabh pant

టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ లేని లోటు టీమిండియాపై తీవ్రంగా పడనుంది. వన్డే, టీ20ల్లో అయితే సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేదంటే కెఎల్ రాహుల్ ఇలా చాలామంది వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. టెస్టుల్లో మాత్రం రిషబ్ పంత్‌ ప్లేస్‌ని రిప్లేస్ చేయడం చాలా కష్టం...

Rishabh Pant

ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు. ఈ విజయంలో రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్, అతని కెరీర్ గ్రాఫ్‌నే మార్చేసింది...

Image credit: Getty

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌కి రిషబ్ పంత్ దూరంగా ఉండబోతున్నాడు. రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ దూరంగా ఉంటే, ఆ టీమ్‌ని నడిపించేది ఎవరు? అనే విషయంపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది...

Rishabh Pant-Rohit Sharma

అన్నింటికంటే ముఖ్యంగా అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ సమయానికి రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ సాధించి, టీమిండియాకి అందుబాటులోకి వస్తాడా?  ఈ విషయంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరికొందరైతే ముందు అతని ఆరోగ్య పరిస్థితి కుదుటపడనివ్వండని, ఆ తర్వాత ఎన్ని సిరీసులైనా ఆడుకొవచ్చని కామెంట్లు చేస్తున్నారు...

click me!