విరాట్ కోహ్లీ మాటలు చెప్పినట్టుగా, ఆట ఆడడం లేదు... వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

Published : Mar 14, 2021, 03:13 PM IST

వరుసగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న భారత సారథి విరాట్ కోహ్లీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రెస్ మీట్‌లో మాటలు చెప్పినంత గొప్పగా, మైదానంలో అతని ఆట ఉండడం లేదని వ్యాఖ్యానించాడు వీరూ...

PREV
18
విరాట్ కోహ్లీ మాటలు చెప్పినట్టుగా, ఆట ఆడడం లేదు... వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

‘విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు.ఎక్కడ తప్పు జరిగిందో, వైఫల్యానికి కారణం ఏంటో చక్కగా వివరిస్తున్నాడు...  కానీ మైదానంలో మాత్రం అలాంటి ఆటతీరు చూపించలేకపోతున్నాడు.

28

కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కీపర్ రిషబ్ పంత్‌ను వెనకేసుకొచ్చారు... అతనికి స్వేచ్ఛగా ఆడే స్వాతంత్య్రం ఇస్తామని చెప్పారు. కానీ రిషబ్ పంత్ వరుసగా రెండు, మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయితే, అతనికి జట్టులో చోటు ఉంటుందా? ఉండదనే నా అభిప్రాయం...

38

గంగూలీ కెప్టెన్సీలో నేనే స్వేచ్ఛగా ఆడేవాడిని. కొన్ని మ్యాచుల్లో భారీ షాట్లకి ప్రయత్నించి అవుట్ అయినా, నాకు జట్టులో చోటు ఉండేది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నాలా ఆడే మరో ప్లేయర్ కనిపిస్తే, వెంటనే నన్ను జట్టు నుంచి తీసి పక్కనబెడతారు...

48

మహేంద్ర సింగ్ ధోనీ ఆడినట్టుగా రిషబ్ పంత్ ఆడాలని కోహ్లీ, రవిశాస్త్రి కోరుకుంటున్నారు. కానీ ధోనీ, పంత్ ఎప్పుడూ సమానం కాదు. పంత్, ధోనీలా ఆడలేడు. ధోనీ, పంత్‌లా ఆడలేడు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ గ్రహిస్తే మంచిది...

58

ప్రతీ రెండు, మూడు మ్యాచులకు ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టులో మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావించడం ఏ మాత్రం మంచిది కాదు. కొన్నిసార్లు టాలెంట్ ఉన్న ప్లేయర్లు వరుసగా ఫెయిల్ అవుతున్నా, వారికి నిరూపించుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి...

68

నాలుగు మ్యాచుల్లో పరుగులు చేయలేదని పక్కనబెడితే, జట్టులోని మిగిలిన ప్లేయర్లు కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది... ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కి విశ్రాంతి ఇవ్వడం చాలా పెద్ద తప్పు. ఉరికే ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది...

78

తొలి రెండు టీ20లకు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా భావించడం చాలా పెద్ద పొరపాటు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సరిగా పరుగులు చేయలేకపోతున్నాడు. మరి నాకు విశ్రాంతి కావాలని అతను మేనేజ్‌మెంట్‌ను అడగగలడా?

88

వరుసగా మ్యాచులు ఆడాల్సిన కెప్టెన్ విశ్రాంతి తీసుకోనప్పుడు, ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ రెస్టు కావాలని ఎందుకు కోరుకుంటారు...’ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్..

click me!

Recommended Stories