కావాలనే బంతిని బౌండరీకి పోనిచ్చిన ఫీల్డర్... పెనాల్టీ విధించిన అంపైర్లు... జింబాబ్వే, ఆఫ్ఘాన్ టెస్టులో...

Published : Mar 13, 2021, 05:20 PM IST

ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కావాలని బంతిని బౌండరీకి పోనిచ్చినందుకు ఆఫ్ఘాన్‌కి పెనాల్టీ విధించారు అంపైర్లు. జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జరిగిందీ అరుదైన సంఘటన. 

PREV
17
కావాలనే బంతిని బౌండరీకి పోనిచ్చిన ఫీల్డర్... పెనాల్టీ విధించిన అంపైర్లు... జింబాబ్వే, ఆఫ్ఘాన్ టెస్టులో...

ఎంత భారీ లక్ష్యం అయినా, బౌండరీకి వెళ్తున్నప్పుడు బంతిని ఆపాలని ప్రయత్నిస్తారు ఫీల్డర్లు. అయితే ఆఫ్ఘాన్ సంచలన బ్యాట్స్‌మెన్ హస్మతుల్లా షాహిదీ మాత్రం నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న టెయిలెండర్ బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగ్ రావాలనే ఉద్దేశంతో కావాలని బంతిని బౌండరీకి తరలించాడు. 

27

తొలి ఇన్నింగ్స్‌ల్లో హస్మతుల్లా షాహిదీ డబుల్ సెంచరీ చేయడంతో 545/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది ఆఫ్ఘాన్. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 287 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 
జింబాబ్వే బ్యాట్స్‌మెన్ సికందర్ రాజా 85 పరుగులతో రాణించాడు. 

37

అయితే 8వ వికెట్ పడిన తర్వాత వచ్చిన ముజరబనికి స్ట్రైయిక్ వస్తే త్వరగా అవుట్ అవుతాడనే ఉద్దేశంతో సికందర్ రాజా కొట్టిన బంతిని బౌండరీ లైన్‌కి తాకేదాకా వదిలేశాడు ఫీల్డర్ హస్మతుల్లా షాహిదీ...

47

బంతి బౌండరీ లైన్‌కి తాకిందో, లేదోననే అనుమానంతో లైన్‌కి అవతల కాలుపెట్టి మరీ బాల్ తీసుకున్నాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించినందుకు జింబాబ్వే స్కోరుకి అదనంగా మరో పరుగు జోడించారు అంపైర్లు...

57

అంతేకాకుండా బౌండరీ వెళ్లినప్పటికీ ఐదు పరుగులు ఇచ్చిన అంపైర్లు, సికందర్ రాజానే స్ట్రైయిక్ తీసుకునేందుకు అనుమతిచ్చారు. 

67

అయితే ఆ తర్వాతి ఓవర్‌లో ముజరబనీ రనౌట్ కావడం, సికందర్ రాజా ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో 287 పరుగుల వద్ద జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 

77

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ ఖాన్, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే, ప్రస్తుతం 220 పరుగుల వద్ద ఫాలోఆన్ ఆడుతోంది. 

click me!

Recommended Stories