గెలవాలంటే రెండో టీ20 మ్యాచ్‌లో ఈ మార్పులు తప్పనిసరి... ప్రయోగాల కోసం సిరీస్...

First Published Mar 13, 2021, 4:46 PM IST

తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు, ఇంగ్లాండ్‌కి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై, 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. రెండో టెస్టులో గెలవాలంటే టీమిండియా ఈ మార్పులు చేయడం తప్పనిసరి అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

రోహిత్ శర్మ రావాల్సిందే... మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ జట్టులో ఉంటే, ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ నిండుతాయి. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు కాస్త ఒత్తిడికి లోనవుతుంది.
undefined
ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి నివ్వాలని టీమిండియా తీసుకున్న తప్పని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. అయినా సరే రెండో టీ20 మ్యాచ్‌లో కూడా రోహిత్‌ను పక్కనబెడితే టీమిండియా భారీ మూల్యం చెల్లించక తప్పదు...
undefined
కెఎల్ రాహుల్ చాలా రోజులుగా జట్టుతో కొనసాగుతున్నా, అతను మ్యాచ్ ఆడి చాలారోజులవుతోంది. మరోవైపు శిఖర్ ధావన్‌లో మునుపటి జోరు కనిపించడం లేదు. కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ, అతనితో పాటు రోహిత్ శర్మను ఓపెనింగ్‌కి పంపించాలి...
undefined
విరాట్ ఫామ్... భారత జట్టును ఆందోళనకి గురి చేస్తున్న ప్రధాన అంశం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్. గత కొన్ని రోజులుగా పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్నాడు విరాట్ కోహ్లీ. కాబట్టి అతను త్వరగా అవుటైన ఆ ప్రభావం జట్టుపైన పడకుండా ఉండేందుకు జట్టులో కొన్ని మార్పులు చేస్తే బెటర్..
undefined
సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ... ముంబై ఇండియన్స్ త్వరగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు అందించాడు సూర్యకుమార్ యాదవ్. భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న అతనికి చోటు కల్పించాల్సిందే...
undefined
తొలి టీ20లో అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్‌ను పక్కనబెట్టడం పొరపాటే అవుతుంది. కాబట్టి టీ20 ముగ్గురు స్పిన్నర్ల అవసరం ఉండదు కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ను తప్పించి, సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులో తప్పిస్తే చాలా బెటర్...
undefined
ముగ్గురు స్పిన్నర్ల మంత్రం ఫెయిల్... తొలి టీ20 మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన టీమిండియా, ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. కాబట్టి స్పిన్నర్లను తగ్గించి, ఫామ్‌లో ఉన్న పేసర్లను బరిలో దించాలి...
undefined
భువనేశ్వర్ కుమార్ కమ్‌బ్యాక్... దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువీ, ఆ తర్వాత పెద్దగా క్రికెట్ ఆడలేదు. సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీలు ఆడినా, మునుపటి భువీ స్పీడ్ కనిపించడం లేదు...
undefined
భువనేశ్వర్ కుమార్ పర్ఫామెన్స్‌లో కమ్ బ్యాక్ ఇచ్చేంతవరకూ అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే నటరాజన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలి. లేదంటే మంచి ఫామ్‌లో ఉన్న దీపక్ చాహార్‌కి అయినా అవకాశం కల్పించాలి...
undefined
యజ్వేంద్ర చాహాల్ ఓ వికెట్ తీసినా.. 4 ఓవర్లలోనే 44 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా టూర్‌లోనూ మొదటి టీ20 తర్వాత పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు చాహాల్. కాబట్టి అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను కొనసాగిస్తూ రాహుల్ చాహార్‌ను ఉపయోగించుకుంటే బెటర్ ఫలితాలు రాబట్టవచ్చు...
undefined
మరో రెండు మ్యాచులు ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీకి కూడా అవసరమైన విశ్రాంతి కల్పించి, జట్టు అవసరాల నిత్యం మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ఆడిస్తే... టీమిండియా మంచి కమ్‌బ్యాక్ ఇవ్వగలుగుతుంది.
undefined
టీ20 సిరీస్ ఆరంభానికి ముందే ప్రయోగాలు చేయబోతున్నట్టు ప్రకటించాడు భారత సారథి విరాట్ కోహ్లీ. అయితే ప్రయోగాల పేరుతో సిరీస్ కోల్పోతే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండో ర్యాంకును కోల్పోవాల్సి ఉంటుంది.
undefined
click me!