Image credit: Getty
‘2016లో కేవిన్ పీటర్సన్ నాకు ఈ పేరు పెట్టాడు. అప్పుడే మొట్టమొదటిసారి నేను లీగ్ గేమ్స్ ఆడాను. కేవిన్ పీటర్సన్, మా టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. మా ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఆ మ్యాచ్ తర్వాత నేను, నేషనల్ డ్యూటీ కోసం వెళ్లిపోవాలి...
ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు కావాల్సి వచ్చాయి. నేను వెళ్లి మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ని ముగించాను. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత కేవిన్ పీటర్సన్ పిలిచి, బాగా ఆడావని మెచ్చుకున్నారు...
Image Credit: Getty Images
‘నువ్వు ఆఫ్ఘాన్ ఫ్యూచర్‌వి. ఆఫ్ఘాన్ క్రికెట్‌ని జీరో నుంచి ఈస్థాయికి తీసుకొచ్చావ్. గట్టిగా ప్రయత్నిస్తే ఆఫ్ఘాన్‌కి ఫ్యూచర్ ప్రెసిడెంట్‌వి అవుతావు...’ అని నాతో అన్నాడు కేవిన్ పీటర్సన్...
కేవిన్ పీటర్సన్ అన్న మాటలు, మైక్‌లో అందరూ విన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏ లీగ్‌కి వెళ్లినా కామెంటేటర్లు, నా తోటి క్రికెటర్లు ప్రెసిడెంట్ అని పిలవడం మొదలెట్టారు. నాకు కూడా ఆ పిలుపు బాగా నచ్చింది...
అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. రాజకీయాలను, ఆటలను కలపడం కరెక్ట్ కాదు. ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడకూడదని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని నా అభిప్రాయం. వరల్డ్ కప్ సమయంలో ఆఫ్ఘాన్‌తో ఆడమని చెప్పలేదు ఎందుకు?
అప్పుడు మాతో ఆడే 2 పాయింట్లు వాళ్లకి కావాలి. వరల్డ్ కప్‌లో మంచి నెట్ రన్ రేట్ కావాలి. వన్డే వరల్డ్ కప్‌లో మాతో ఆడకుండా బాయ్‌కాట్ చేస్తారా? చేయరు కదా... మాతో వన్డే సిరీస్ ఆడకపోవడానికి ఆస్ట్రేలియా చూపించిన కారణం సరైనది కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఆఫ్ఘాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ..