ధోనీకి వయసైపోయింది! ఇప్పుడు కూడా అలాగే ఆడాలంటే ఎలా... సీఎస్‌కే కోచ్ షాకింగ్ కామెంట్స్...

Published : Apr 01, 2023, 04:38 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ని ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌గా ప్రమోట్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కేకి నాలుగు టైటిల్స్ అందించిన ధోనీ, 2023 సీజన్‌తో సొంత మైదానంలో సొంత అభిమానుల మధ్య ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది...

PREV
19
ధోనీకి వయసైపోయింది! ఇప్పుడు కూడా అలాగే ఆడాలంటే ఎలా... సీఎస్‌కే కోచ్ షాకింగ్ కామెంట్స్...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌‌లో ఓ సిక్స్, ఓ ఫోర్ బాదిన మహేంద్ర సింగ్ ధోనీ, తన ఫ్యాన్స్‌ని అలరించాడు. 41 ఏళ్ల వయసులోనూ తనలో మునుపటి జోరు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మాహీ...
 

29

ధోనీకి గాయమైందని, మొదటి మ్యాచ్‌లో అతను ఆడడం అనుమానమేనని ప్రచారం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, ధోనీ గురించి, ఈ వార్తల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు. అతనికి గాయమైందనే వార్త ఎలా పుట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు...

39
MS Dhoni

మాహీకి గాయమైన మాట నిజమే కానీ అది ఇప్పటిది కాదు, మార్చి నెల ప్రారంభంలో నిర్వహించిన ప్రీ సెషన్‌లో జరిగింది. అది కూడా చాలా చిన్న గాయం. మోకాలి గాయం కాదు. మాహీ ఫిట్‌గా ఉన్నాడు, ఐపీఎల్ 2023 సీజన్‌లో అన్ని మ్యాచులు ఆడతాడు...

49
Image credit: PTI

ధోనీ వయసు పెరిగింది. 15 ఏళ్ల క్రితం ధోనీ ఎలా ఆడేవాడో ఇప్పుడు కూడా అలాగే ఆడాలని ఆశించడం కరెక్ట్ కాదు. వయసు పెరిగినా ధోనీ ఇప్పటికీ గొప్ప లీడరే.. బ్యాటుతో కూడా ధోనీ తన వంతు పాత్ర పోషిస్తాడు...

59
MS Dhoni

ఈ వయసులో తన బలం ఏంటో, బలహీనతలు ఎంటో ధోనీకి క్లారిటీ ఉంది. వయసు పెరిగే కొద్దీ ఈ క్లారిటీ చాలా అవసరం. ధోనీ ఓ లెజెండ్. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్ అవసరం లేదు...

69

రాజ్‌వర్థన్ హంగర్‌గేకర్‌ని గత సీజన్‌లో ఆడించకుండా అట్టి పెట్టాం. అతనిలో చాలా ఇంప్రూమెంట్ కనిపిస్తోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన తర్వాత తన ఆటలో పరిణతి వచ్చింది. అయితే అతను ఇంకా కొన్ని ఏరియాల్లో లోపాలను సరిదిద్దుకోవాలి.. 

79
GT vs CSK

లక్ష మంది జనం మధ్య తొలి మ్యాచ్ ఆడేటప్పుడు కంగారు పడడం, ఒత్తిడికి లోను కావడం సహజం. అయితే రాజ్‌వర్థన్‌లో అదేమీ కనిపించలేదు. మ్యాచ్‌ని బాగా ఎంజాయ్ చేశాడు. ఏ ప్లేయర్‌కైనా కావాల్సింది అదే...

89
Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్‌ అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్. అతను ఆటను అర్థం చేసుకునే విధానం, టాప్ క్లాస్ బౌలర్లను ఆడే విధానం వేరే లెవెల్. అతను సెంచరీ మిస్ అయినందుకు నిరుత్సాహపడవచ్చు..
 

99
Image credit: PTI

అయితే ఈ సీజన్‌లో అతని బ్యాటు నుంచి చాలా సెంచరీలు వస్తాయని అనుకుంటున్నా. అతను చేసిన ఈ 90-92 పరుగులు సెంచరీకి తక్కువేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.. 
 

Read more Photos on
click me!

Recommended Stories