యువీ కంటే ముందు ధోనీ బ్యాటింగ్‌కి వస్తాడని ముందే తెలుసు! అదే కారణం... ముత్తయ్య మురళీధరన్ కామెంట్..

First Published Jun 30, 2023, 6:45 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటుతో, బంతితో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు యువరాజ్ సింగ్. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకోవడం వల్లే యువీకి రావాల్సినంత గుర్తింపు రాలేదంటారు ఫ్యాన్స్..

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ ఇవ్వలేదు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ అండ్ కో.. బ్యాటింగ్‌లో రాణించి టీమిండియాని ఫైనల్‌కి చేర్చారు..

అయితే శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడో వికెట్‌గా విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపాలని అంతకుముందు టీమ్ మీటింగ్‌లో కూడా అనుకోలేదు..

Latest Videos


అప్పటికే గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో చేయాల్సిన లక్ష్యం తగ్గిపోవడంతో మాహీ, వరల్డ్ కప్ క్రెడిట్ కొట్టేయడం కోసమే తనను తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసుకున్నాడని ధోనీ హేటర్స్ వాదన.. 

దీనిపై ఎట్టకేలకు స్పందించాడు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కోసం ఇండియాకి వచ్చిన మురళీధరన్, మీడియాతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు..

‘వరల్డ్ కప్‌ 2011 టోర్నీలో యువరాజ్ సింగ్ బెస్ట్ ప్లేయర్. నాలుగో స్థానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఫైనల్‌లో యువరాజ్ కంటే ముందు ధోనీ వస్తానని నాకు ముందే తెలుసు. ఎందుకంటే యువీకి నాపైన మంచి రికార్డు లేదు..

నా బౌలింగ్ ఫేస్ చేయడానికి యువరాజ్ సింగ్ కచ్ఛితంగా ఇబ్బంది పడేవాడు. ధోనీకి నా బౌలింగ్ బాగా తెలుసు. ఎందుకంటే చెన్నైలో నెట్స్‌లో నా బౌలింగ్‌ని చాలా సార్లు ఎదుర్కొన్నాడు. అందుకే నాకు వికెట్ పడకూడదని ధోనీ అనుకుని ఉంటాడు..

అతని వల్లే ఫైనల్‌లో నేను బాగా బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయా. ఆ మ్యాచ్‌లో పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండడంతో అస్సలు స్పిన్‌కి సహకరించడం లేదు. 

గౌతమ్ గంభీర్ కూడా క్రీజులో కుదురుకుపోవడంతో ధోనీయే వస్తాడని అనుకున్నా, అతనే వచ్చాడు...’ అంటూ కామెంట్ చేశాడు ముత్తయ్య మురళీధరన్.. 

click me!