రీఎంట్రీ ఇవ్వాలనుకున్న ఏబీ డివిల్లియర్స్... కేవలం ఆ ఒక్క కారణంగానే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట...

First Published May 20, 2021, 11:02 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ముందు నుంచి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే తాను రీఎంట్రీ ఇవ్వడం లేదని చెప్పి, అభిమానులను, సౌతాఫ్రికా క్రికెట్ జట్టును నిరాశకు గురి చేశాడు ఏబీడీ.

‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌తో రీఎంట్రీ గురించి జరిపిన చర్చలు ముగింపునకి వచ్చాయి. తాను ఒక్కసారి తీసుకున్న నిర్ణయం, మళ్లీ వెనక్కి తీసుకోవాలని భావించడం లేదని.. అదే ఫైనల్ అని చెప్పినట్టు తెలియచేసింది సఫారీ క్రికెట్ బోర్డు.
undefined
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడిగా గుర్తించబడిన ఏబీడీ, రీఎంట్రీ ఇస్తే సౌతాఫ్రికా కష్టాలు తీరతాయని భావించింది సఫారీ క్రికెట్ టీం. అయితే ఏబీ డివిల్లియర్స్, క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఆలోచననుంచి తగ్గడానికి కారణం వేరే ఉందట.
undefined
‘ప్రస్తుతం సౌతాఫ్రికా క్రికెట్ జట్టు యువకులతో నిండి ఉంది. ఏబీ డివిల్లియర్స్, రీఎంట్రీ ఇస్తే, అతని కోసం ఏ ప్లేయర్‌ను తప్పించాల్సి ఉంటుంది. తన వల్ల ఓ యువ క్రికెటర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారకూడదని ఏబీడీ ఈ నిర్ణయం తీసుకున్నాడు’ అంటూ తెలిపారు సఫారీ కోచ్ మార్క్ బ్రౌచర్.
undefined
‘2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని ఏబీ డివిల్లియర్స్ తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాం. ప్రతీ క్రికెటర్‌కి తాను కోరుకున్న సమయంలో ఆటకు వీడ్కోలు పలికే స్వేచ్ఛ, స్వాతంత్య్రంఉంటాయి...
undefined
ఏబీ డివిల్లియర్స్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్, ప్లేయర్‌ను సఫారీ జట్టు తప్పకుండా మిస్ అవుతుంది. అతను బెస్ట్ ఫినిషర్. ఐపీఎల్ సీజన్‌లో అతను ఆడుతున్న విధానం చూస్తుంటే, ఏబీ డివిల్లియర్స్ ఇంకా క్రికెట్ ఆడగల సత్తా ఉందని స్పష్టంగా తెలుస్తోంది...
undefined
యువ ఆటగాళ్ల కోసం రీఎంట్రీ ఆలోచనను విరమించుకున్నాడు ఏబీ డివిల్లియర్స్. ఇకపై సఫారీ బోర్డు కూడా ఈ విషయాన్ని మరిచిపోయి, సత్తా ఉన్న యంగ్ ప్లేయర్ల కోసం అవకాశాలు సృష్టిస్తుంది’ అంటూ తెలిపారు దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్ మార్క్ బ్రౌచర్...
undefined
గత దశాబ్దకాలంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్, నాలుగేళ్ల పాటు వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగాడు. 2004లో ఎంట్రీ ఇచ్చిన ఏబీడీ, వన్డేల్లో 9557, టెస్టుల్లో 8765 పరుగులు చేశాడు.
undefined
2018లో అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఏబీ డివిల్లియర్స్ ప్రకటించడంతో షాక్‌కి గురైంది సఫారీ క్రికెట్ టీమ్. ఏబీడీ రిటైర్మెంట్ తర్వాత సఫారీ టీమ్ పర్ఫామెన్స్ ఘోరంగా దిగజారింది.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో పసికూన జట్టు అయిన ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా ఓడింది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత కూడా దారుణమైన పర్ఫామెన్స్‌తో అభిమానులకు తీవ్రంగా డిస్సపాయింట్ చేస్తోంది.
undefined
click me!