ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే, అదే ఫైనల్... కమ్‌బ్యాక్‌పై సంచలన నిర్ణయం ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్...

First Published May 18, 2021, 5:46 PM IST

‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ, మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చేప్పేశాడు సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిల్లియర్స్..

‘ఏబీ డివిల్లియర్స్‌తో రీఎంట్రీ గురించి చర్చలు ముగిశాయి. ఒక్కసారి తీసుకున్న నిర్ణయం, మళ్లీ వెనక్కి తీసుకోలేనని, తన రిటైర్మెంట్ ఫైనల్ అని చెప్పాడు ఏబీడీ’ అంటూ స్టేట్‌మెంట్ జారీ చేసింది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు.
undefined
ఐపీఎల్ 2021సీజన్‌లో ఏబీ డివిల్లియర్స్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత, అతను తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఆశపడిన ఫ్యాన్స్‌, ఈ వార్తతో నిరుత్సాహానికి లోనవుతున్నారు.
undefined
‘మిస్టర్ 360’, ‘మిస్టర్ డిపెండబుల్’ ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు రావడానికి ప్రధాన కారణం సౌతాఫ్రికా క్రికెట్ జట్టే.ఐపీఎల్ 2021 సీజన్‌లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీడీని వెనక్కి రావాల్సిందిగా కోరింది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ ముందు ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఏబీ డివిల్లియర్స్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. సూపర్ స్టార్‌లా, వన్‌మ్యాన్ ఆర్మీలా అదరగొట్టే ఏబీడీ రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పర్ఫామెన్స్ దారుణంగా తయారైంది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో పసికూన జట్టు అయినఆఫ్ఘాన్‌తో కూడా ఓడిన సౌతాఫ్రికా... ఆ తర్వాత వరుసగా సిరీస్‌లు ఓడితూ దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. దీంతో ఏబీడీని రీఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరింది సఫారీ క్రికెట్బోర్డు..
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలోనే అవసరమైతే తాను మళ్లీ ఆడతానని ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్. అయితే అప్పుడు ఏబీడీ ఇచ్చిన ఆఫర్‌నుసఫారీ క్రికెట్ బోర్డు,తిరస్కరించింది.
undefined
అయితే ఆ తర్వాత రోజురోజుకీ సౌతాఫ్రికాపరిస్థితి దారుణంగా తయారవుతుండడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు ఏబీ డివిల్లియర్స్‌ కమ్‌బ్యాక్ చేయాలనుకుంటే, డోర్లు తెరిచే ఉన్నాయంటూ ప్రకటించాడు సఫారీ క్రికెట్ కోచ్ మార్క్ బ్రౌచర్.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత తన రీఎంట్రీ గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో ఏబీడీ రీఎంట్రీ ఖాయమనుకున్నారంతా.వెస్టిండీస్ టూర్‌లో ఆడబోయే 2 టెస్టులు, 5 టీ20లకు ప్రకటించిన జట్టులో ఏబీ డివిల్లియర్స్‌తో సీనియర్లు ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌‌లకు కూడా చోటు కల్పించాడుసఫారీ జట్టు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్.
undefined
టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిల్లియర్స్, క్రిస్ మోరిస్‌, డుప్లిసిస్, ఇమ్రాన్ తాహీర్, డి కాక్, కగిసో రబాడా, నోకియా వంటి టాప్‌ క్లాస్ ప్లేయర్లతో నిండినటీమ్‌తో బరిలో దిగాలని భావించింది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు.. అయితే ఏబీడీ నిర్ణయంతో సఫారీ టీమ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది..
undefined
37 ఏళ్ల ఏబీ డివిల్లియర్స్ తన కెరీర్‌లో114 టెస్టులు ఆడి 8765 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 9577 పరుగులు చేసిన ఏబీడీ 25 సెంచరీలు సాధించాడు. 78 టీ20ల్లో 1672 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తర్వాత 5 వేల పరుగులు పూర్తిచేసుకున్న విదేశీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
click me!