నేను ఇంకా రిటైర్ అవ్వలేదు, ఆడట్లేదంతే... ఈసారి వరల్డ్ కప్ గెలిచేది వాళ్లే! - క్రిస్ గేల్...

Published : Jun 30, 2023, 05:35 PM IST

ఇండియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విదేశీ ప్లేయర్లలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఒకడు. ఐపీఎల్‌ కంటే ముందే క్రిస్ గేల్‌కి ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు బాదిన క్రిస్ గేల్, 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడడం మానేశాడు..  

PREV
17
నేను ఇంకా రిటైర్ అవ్వలేదు, ఆడట్లేదంతే... ఈసారి వరల్డ్ కప్ గెలిచేది వాళ్లే!  - క్రిస్ గేల్...

2022 ఐపీఎల్ మెగా వేలానికి పేరు రిజిస్టర్ చేయించుకోని క్రిస్ గేల్, 2023 వేలంలో కూడా పాల్గొనలేదు. 43 ఏళ్ల క్రిస్ గేల్, ఇంకా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదని అంటున్నాడు..

27
Image credit: Getty

‘ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ కాబట్టి ఇండియా, పాకిస్తాన్ టీమ్స్ ఫెవరెట్స్. వాళ్లకి ఇక్కడ ఎలా ఆడాలో బాగా తెలుసు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలవు. కాబట్టి ఈ నాలుగు టాప్‌లో ఉంటాయని అనుకుంటున్నా..

37
Chris Gayle

న్యూజిలాండ్‌కి కూడా ఛాన్స్ ఉంది. అయితే న్యూజిలాండ్‌కి ఇండియాలో మంచి రికార్డు లేదు. కాబట్టి ఆస్ట్రేలియాని సెలక్ట్ చేశా. వెస్టిండీస్ టీమ్‌, వరల్డ్ కప్ గెలుస్తుందన్న ఆశ, నమ్మకం రెండూ లేవు. వెస్టిండీస్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే నిజంగా బాధగా ఉంది..

47
Virat Kohli

విరాట్ కోహ్లీకి ఇది ఆఖరి వరల్డ్ కప్ కాదు, ఎందుకంటే అతను ఇంకో వరల్డ్ కప్ దాకా ఆడగలడు. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కాబట్టి ఈసారి విరాట్ కోహ్లీ బ్యాటుతో అదరగొడతాడని అనుకుంటున్నా... 

57
Jasprit Bumrah

టీమిండియాకి జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్స్. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే యాషెస్ సిరీస్ కంటే చాలా పెద్దది. ప్రపంచమంతా ఆ మ్యాచ్ చూసేందుకు ఎదురుచూస్తుంది... నేను కూడా ఆ మ్యాచ్‌కి వెళ్తాను..

67
Chris Gayle and Marsh

నేను ఇంకా క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాలని అనుకున్నా. అయితే ఆ అవకాశం రాలేదు. 

77
Image Credit: Getty Images

 విండీస్ బోర్డుకి కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు, నాకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందనైతే నమ్మకం లేదు. నేనింకా రిటైర్ కాలేదు, ఆడడం లేదంతే.. ఎప్పుడైనా మనసు మార్చుకుని ఆడొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. 

click me!

Recommended Stories