కోహ్లీతోనే ఆ రోజులు అయిపోయాయి! శుబ్‌మన్ గిల్‌కి టెస్టు కెప్టెన్సీ ఇస్తే బెటర్... - ఆకాశ్ చోప్రా...

First Published | Jan 29, 2023, 5:18 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లను కెప్టెన్లుగా ప్రయత్నించి, చివరికి హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్‌గా సెటిల్ అయ్యింది... రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యా, టీమిండయా వైట్ బాల్ కెప్టెన్సీ తీసుకుంటాడనేది దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది...

Image credit: PTI

హార్ధిక్ పాండ్యా వన్డే, టీ20ల్లో కెప్టెన్సీ తీసుకుంటే, టెస్టు కెప్టెన్ ఎవరు అవుతారు. హార్ధిక్ పాండ్యా టెస్టులు ఆడక మూడేళ్లు అయిపోతోంది. వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, టెస్టు ఫార్మాట్ ఆడేందుకు పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు...
 

Image credit: Getty

రోహిత్ శర్మ తర్వాత కెఎల్ రాహుల్‌కి లేదా జస్ప్రిత్ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌కి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించి, విమర్శకులను మెప్పించాడు. అయితే విజయం మాత్రం అందించలేకపోయాడు...
 


అంతా బాగుంటే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా టీమిండియా టెస్టు కెప్టెన్సీ రేసులో ఉండేవాడు. టెస్టుల్లో టీమిండియాకి కీలక సభ్యుడిగా మారిన రిషబ్ పంత్, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి క్రికెట్‌కి దూరమయ్యాడు. రిషబ్ పంత్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే దానిపై రోజుకో వార్త వినిపిస్తోంది...


‘టీమిండియాకి మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. విరాట్ కోహ్లీతోనే ఆ టైమ్ అయిపోయినట్టుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు...

హార్ధిక్ పాండ్యా టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 వరకూ హార్ధిక్ పాండ్యానే టీ20 కెప్టెన్‌గా కొనసాగించవచ్చు. వన్డే వరల్డ్ కప్ 2023 వరకూ వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి...

టీమిండియాకి సుదీర్ఘ కాలం సేవలు అందించే కెప్టెన్ అవసరం. నా ఉద్దేశంలో రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది. అతను రీఎంట్రీ ఇవ్వడానికి సమయం పడితే, శుబ్‌మన్ గిల్‌లో మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. 

అండర్19 వరల్డ్ కప్‌కి శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి టెస్టుల్లో గిల్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే, మరో 10 ఏళ్ల వరకూ టీమిండియా మరో కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన అవసరం రాదు...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. 

Latest Videos

click me!