ఆస్ట్రేలియాలో టీమిండియా క్రికెటర్ల భద్రతపై అనుమానాలు... క్రీజులోకి దూసుకొచ్చిన మరో అభిమాని...

First Published | Nov 6, 2022, 5:55 PM IST

2021 ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా క్రికెటర్ల కంటే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకున్నాడు జార్వో. 69 నెంబర్ జెర్సీతో క్రీజులోకి పరుగెత్తుకుంటూ వస్తూ ఇండియా- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి పలుమార్లు అంతరాయం కలిగించాడు ఈ అభిమాని... కరోనా ప్రోటోకాల్, కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని జార్వో తేలిగ్గా ఒకటికి నాలుగు సార్లు స్టేడియంలోకి రావడం చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లోనూ అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని, సెక్యూరిటీ కళ్లు గప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేస్తున్న భువీ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆ అభిమాని...

Image credit: Getty

సెక్యూరిటీ కంచెను దాటి, క్రీజులోకి అడుగుపెట్టినందుకు సదరు క్రికెట్ ఫ్యాన్‌కి 9913.20 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అంటే భారీతీయ కరెన్సీలో దాదాపు 5 లక్షల 20 వేల రూపాయలకు పైగా ఫైన్ రూపంలో చెల్లించాడు ఆ టీమిండియా అభిమాని...

Latest Videos


తాజాగా ఇండియా- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే రిపీట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని, సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి, అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు...

సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గుర్తించి, బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ టీనేజర్. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి రూ.6 లక్షల 50 వేల భారీ జరిమాని విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా..

rohit rahul

ఐదు మ్యాచుల్లో ఇప్పటికే రెండు సార్లు గ్రౌండ్‌లోకి అభిమానులు ఎంటర్ కావడంతో ఆస్ట్రేలియాలో టీమిండియా క్రికెటర్ల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. 

భారత జట్టు మ్యాచులు గెలుస్తూ ఉంది కాబట్టి అభిమానులు సంతోషంతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, అభిమాన క్రికెటర్లను కలవడానికి ఇలా గ్రౌండ్‌లోకి వస్తున్నారు. అదే రిజల్ట్ తేడా కొడితే... హద్దులు మీరిన ఆవేశంతో గ్రౌండ్‌లోకి వచ్చే అభిమానులను ఆస్ట్రేలియా అడ్డుకోగలదా? అనేది టీమిండియా ఫ్యాన్స్ అనుమానం, ఆవేదన... 

click me!