ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్‌లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. వెస్టిండీస్, జింబాబ్వే, నమీబియా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘాన్... ఇలా వర్షం కారణంగా ఇప్పటికే అరడజనుకి పైగా మ్యాచులు రద్దయ్యాయి...
Image credit: PTI
ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో 80 శాతం వాన ఉంటుందని, మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేసింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు...
యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియాకి ఎదురైన తొలి పరాభవం ఇదే. దీంతో ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కసిగా ఎదురుచూస్తోంది భారత జట్టు...
ఆసియా కప్ 2022 టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించినా సూపర్ 4 రౌండ్‌లో మరోసారి టీమిండియాకి పరాజయం ఎదురైంది. గత ఏడాదిలో మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది..
పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ, గాయం నుంచి కోలుకుని టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో మ్యాచ్ ఆడబోతున్నాడు. మరోవైపు భారత జట్టు మాత్రం జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఇద్దరు కీలక ప్లేయర్లను దూరం చేసుకుంది...