మనకంత సీన్ లేదు! టీమిండియా సెమీస్ చేసే ఛాన్స్‌ 30 శాతం మాత్రమే... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు...

First Published | Oct 20, 2022, 9:39 AM IST

రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ వచ్చిన భారత క్రికెట్ జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆసియా కప్‌ 2022లో సెమీస్ కూడా చేరలేకపోయిన టీమిండియా, భారీ అంచనాలతో పొట్టి ప్రపంచకప్ ఆడబోతోంది. అయితే ఈసారి కూడా మనం సెమీస్ చేరడం కష్టమే అంటున్నాడు టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా ఆదివారం, అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.గత ఏడాది పాక్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, ఈ మ్యాచ్ విజయం పరువు సమస్య కూడా...

Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో టీ20 వరల్డ్ కప్‌కి దూరమయ్యారు. రిషబ్ పంత్ కూడా కాలికి బ్యాండేజీతో కనిపించాడు. అయితే ఈసారి భారత జట్టు ఈజీగా సెమీస్ చేరుతుందని సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి భావించారు. అయితే కపిల్ దేవ్ మాత్రం టీమిండియాకి అంత సీన్ లేదంటున్నాడు...
 


ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15తో పాటు  అంతకుముందు టీమిండియా మ్యాచులలో కూడా పెద్దగా ఆకట్టుకోని  భారత జట్టు సారథి రోహిత్ శర్మపై భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్  దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్నా అతడికి రెస్ట్ ఎందుకిచ్చారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. 

‘టీ20 క్రికెట్‌లో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవడం సర్వ సాధారణం. ఆఖరిదాకా ఎవరు గెలుస్తారని పక్కాగా చెప్పలేం. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలు కూడా అంతే. నాకు టీమిండియా, టాప్ 4కి అయినా అర్హత సాధిస్తుందా? అనిపిస్తోంది...

నా వరకూ టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ చేరే అవకాశాలు కేవలం 30 శాతం... సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్ ఉండడం టీమిండియాకి అదృష్టం. అతనికి తోడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ రూపంలో టీమిండియాలో టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు...

అయితే టీ20ల్లో గెలవాలంటే కేవలం బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంటే సరిపోదు. టీమ్‌లో 11 మంది మ్యాచ్ విన్నర్లు ఉండాలి, వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణించగలిగేలా మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్...

అయితే కపిల్ దేవ్ కామెంట్లను జనాలు పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ టీ20లకు పనికి రాడని, అతన్ని వరల్డ్ కప్ టీమ్‌కి ఎంపిక చేయకపోవడమే కరెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కపిల్ దేవ్...

Image credit: PTI

కపిల్ దేవ్ కామెంట్లపై క్రీడా లోకం భిన్నంగా స్పందించింది. ఈ విమర్శల తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీలో 71వ సెంచరీ అందుకోవడమే కాకుండా టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు... దీంతో ఈసారి టీమిండియా ఈజీగా సెమీస్ చేరుతుందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

Latest Videos

click me!