గంగూలీని పంపించారు.. ఇక నెక్స్ట్ టార్గెట్ చేతన్ శర్మ అండ్ కో..?

Published : Oct 19, 2022, 02:30 PM IST

BCCI:  కొద్దిరోజుల హైడ్రామా తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి  సౌరవ్ గంగూలీని పంపించిన బోర్డు పెద్దలు.. ఇప్పుడు నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మన్  చేతన్ శర్మ మీద కన్నేశారు.   

PREV
17
గంగూలీని పంపించారు.. ఇక నెక్స్ట్ టార్గెట్ చేతన్ శర్మ అండ్ కో..?

పలు నాటకీయ పరిణామాల మధ్య  సౌరవ్ గంగూలీని రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కకుండా అడ్డుకుని అతడిని బోర్డు నుంచి పంపించిన బీసీసీఐ పెద్దలు ఇప్పుడు తర్వాత  టార్గెట్ ను కూడా నిర్దేశించుకున్నారు.  దాదా వర్గానికి చెందిన  వ్యక్తులను కూడా బోర్డు నుంచి తప్పించాలని  కంకణం కట్టుకున్న బోర్డు పెద్దలు..  ఇప్పుడు నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ మీద కన్నేశారు. 

27

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక  మాజీ ఆల్ రౌండర్ అయిన చేతన్ శర్మను సెలక్షన్ కమిటీకి చైర్మెన్ గా నియమించాడు.  క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసులు మేరకు 2020 డిసెంబర్ లో కొత్త సెలక్షన్ కమిటీ  నియామకం జరిగింది. ఈ కమిటీకి చేతన్ శర్మ  నేతృత్వం వహిస్తుండగా.. అభయ్ కురువిల్లా, దేబశీష్ మెహంతీలు సభ్యులుగా ఉన్నారు.  

37

అయితే బీసీసీఐ నుంచి దాదాను పంపించిన తర్వాత  ఇప్పుడు   చేతన్ శర్మ వర్గాన్ని కూడా సాగనంపేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తర్వాత చేతన్ శర్మ అండ్ కో. మీద ఎలాంటి చర్యలుంటాయనేది తేలనుంది. 

47

ఇదే విషయమై బీసీసీఐ  ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘భారత జట్టు టీ20 ప్రపంచకప్ లో రాణించేదానిని బట్టి చేతన్ శర్మ భవితవ్యం ఆధారపడి ఉంది. చేతన్ శర్మ పనితీరుపై కొత్త పాలకవర్గంలో కూడా ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. కానీ వాళ్లు కొత్త సెలక్షన్ కమిటీని కోరుకుంటున్నారు. అయితే చేతన్ శర్మ మాత్రం బీసీసీఐ కొత్త  క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ని నియమించేవరకూ అతడు  తన పదవిలోనే కొనసాగుతాడు..’ అని తెలిపాడు. 

57

చేతన్ శర్మ సంగతి అలా ఉంటే మెహంతీ, కురువిల్లా  లు మాత్రం తిరిగి వాళ్ల స్థానాలు దక్కించుకోవడం కష్టమేనని తెలుస్తున్నది. కొద్దిరోజుల్లో మెహంతీ బీసీసీఐలో తన పదవీకాలం ముగించుకోనున్నాడు. అతడు తిరిగి  పోటీ చేస్తాడా..? లేదా..? అనేది ప్రశ్నార్థకమే అయినా మెహంతీని కొనసాగించేందుకు కొత్త పాలకవర్గం సిద్ధంగా లేదని తెలుస్తున్నది.  కురువిల్లా పదవీకాలం ముగియకపోయినా అతడి మెడపైనా కత్తి వేలాడుతున్నది. 

67

మెహంతీ, కురువిల్లా స్థానాల్లో  ఒడిశాకు చెందిన మాజీ క్రికెటర్ శివ సుందర్ దాస్, బెంగాల్  మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా,  నేషనల్ జూనియర్ సెలక్టర్  రణ‌దేవ్ బోస్  సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. 

77

వీరితో పాటు బెంగాల్ కు చెందిన  మాజీ వన్డే క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా  లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్ లో ఒకరికి అవకాశమివ్వొచ్చునని  సమాచారం. 

click me!

Recommended Stories