8 ఓవర్లలో 8 వికెట్లు, 38 పరుగులకే ఆలౌట్ - పూజారి కావాలనుకుని అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా మారాడు ఎవ‌రో తెలుసా?

First Published | Sep 7, 2024, 1:46 PM IST

Most Dangerous Bowler : ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తో పాటు చమిందా వాస్, లసిత్ మలింగ వంటి తుఫాను ఫాస్ట్ బౌలర్లు శ్రీలంక జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాలు అందించారు. శ్రీలంక‌కు చెందిన ఒక ప్లేయ‌ర్ పూజారి కావాల‌నుకుని ప్ర‌పంచంలోని డెంజ‌రస్ బౌల‌ర్ గా మారాడు. 
 

Most Dangerous Bowler : ప్ర‌పంచ‌ క్రికెట్ చరిత్రలో చాలా మంది గొప్పగొప్ప బ్యాట‌ర్లు, బౌల‌ర్లు ఉన్నారు. ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన మాల్కమ్ మార్షల్ నుండి ఆస్ట్రేలియాకు చెందిన డెన్నిస్ లిల్లీ, పాకిస్తాన్‌కు చెందిన వసీం అక్రమ్, అక్తర్, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ వరకు తమ తుఫాను బౌలింగ్‌తో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు.

ఇలా దిగ్గ‌జ బ్యాట‌ర్ల‌ను సైతం భ‌య‌పెట్టిన వారిలో శ్రీలంక బౌలర్లు కూడా తక్కువేమీ కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ను శ్రీలంక టీమ్ లోనే ఉన్నాడు. కేవలం మురళీధరన్‌పైనే ఆధారపడి లంక ఇప్పటివ‌ర‌కు అనేక విజ‌యాలు అందుకోలేదు. అతనికి తోడుగా చమిందా వాస్, లసిత్ మలింగ వంటి తుఫాను ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు.

శ్రీలంక‌కు చెందిన ఒక ప్లేయ‌ర్ పూజారి కావాల‌నుకుని ప్ర‌పంచంలోని డెంజ‌రస్ బౌల‌ర్ గా మారాడు. ఆ జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించాడు. ప్ర‌పంచ గొప్ప బౌల‌ర్ల‌లో ఒక‌డిగా ఘ‌న‌త సాధించాడు. అత‌ని బౌలింగ్ అంటే దిగ్గ‌జ ప్లేయ‌ర్ల‌కు సైతం వ‌ణుకు. అత‌నే చ‌మిందా వాస్. 

క్రికెట్ చరిత్రలో టాప్ ఫాస్ట్ బౌలర్లలో చమిందా వాస్ ఒక‌రు. శ్రీలంక తరఫున టెస్టు, వన్డే, టీ20 సహా మొత్తం 761 వికెట్లు తీశాడు. చ‌మిందా వాస్‌ వన్డే ఫార్మాట్‌లోనే 400 వికెట్లు పడగొట్టాడు. టెస్టులో 355 వికెట్లు, టీ20లో 6 వికెట్లు తీశాడు. టెస్టుల‌తో పాటు వ‌న్డేల్లో గొప్ప రికార్డులు సృష్టించాడు. జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు. 


చ‌మిందా వాస్ 2001లో జింబాబ్వే జట్టుపై విధ్వంసం సృష్టించాడు. దాదాపు జ‌ట్టు మొత్తాన్ని త‌న బౌలింగ్ తో  చెడుగుడు ఆడుకున్నాడు. అత‌ని దెబ్బ‌కు 38 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది జింబాబ్వే. 

చ‌మిందా వాస్ 8 డిసెంబర్ 2001న కొలంబోలోని తన సొంత మైదానంలో జింబాబ్వేపై 8 ఓవర్లలో 8 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించాడు. త‌న ఎనిమిది ఓవ‌ర్ల‌లో 3 ఓవర్లలో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా మెయిడిన్ ఓవ‌ర్లు వేశాడు. అతని 8 ఓవర్ల బౌలింగ్ లో కేవ‌లం 19 పరుగులు మాత్రమే వచ్చాయి.

చ‌మిందా వాస్ తుఫాను బౌలింగ్ కారణంగా జింబాబ్వే జట్టు 40 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయింది. 15.4 ఓవర్లలో 38 పరుగులకే కుప్పకూలింది. స్టువర్ట్ కార్లిస్లే (16 పరుగులు) మినహా మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.

ఈజీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన శ్రీలంక జ‌ట్టు 4.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 40 పరుగులతో విజయం సాధించింది. త‌న కెరీర్ లో తొలి హ్యాట్రిక్ ను కూడా చ‌మిందా వాస్ న‌మోదుచేశాడు. 10వ ఓవర్ మూడు, నాలుగు, ఐదో బంతుల్లో వ‌రుస‌గా వికెట్లు తీశాడు. కార్లిస్లే, క్రెయిగ్ విషార్ట్, టాటెండా తైబులను అవుట్ చేశాడు.

Most Dangerous Bowler

ఈ గొప్ప బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ తర్వాత కూడా చ‌మిందా వాస్ ఎన్నో చిరస్మరణీయమైన విజ‌యాలు అందుకున్నాడు. వాస్ తన కెరీర్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. జింబాబ్వే తర్వాత 2003 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సమయంలో బంగ్లాదేశ్‌పై తన రెండవ హ్యాట్రిక్ సాధించాడు.

చ‌మిందా వాస్ జీవితంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే త‌న చిన్నతనంలో పూజారి కావాలని కలలు కన్నాడ‌ట‌. స్వ‌యంగా అత‌నే ఈ విష‌యాన్ని ఒక‌ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, పూజారి కావాల్సిన అత‌ను శ్రీలంక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా మారాడు.

ప్ర‌పంచంలోని దిగ్గ‌జ బౌల‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు సాధించారు. అలాగే, చ‌మిందా వాస్ పూర్తి పేరు కూడా చాలా పెద్ద‌గా ఉంటుంది. క్రికెట్ లో అత్యంత పొడ‌వైన పేరును క‌లిగిన ప్లేయ‌ర్ ఇత‌నే. అత‌ని పూర్తి పేరు 'వారణాకుల సూర్య పాతబెండిగే ఉసంత జోసెఫ్ చమిందా వాస్'.

Latest Videos

click me!