847 బంతులు 13 గంటల బ్యాటింగ్‌-బౌలర్లను రక్త కన్నీళ్లు పెట్టించిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రో తెలుసా?

First Published | Sep 6, 2024, 10:56 PM IST

Unique Cricket Records : టెస్టు మ్యాచ్ లో ఏకంగా 847 బంతులు ఆడి చ‌రిత్ర సృష్టించాడు. దాదాపు 13 గంట‌ల‌కు పైగా క్రీజులో ఉన్నాడు. ఒక్క‌ సిక్సర్ కూడా కొట్టకుండానే బౌలర్లను రక్త కన్నీళ్లు పెట్టించాడు ఒక బ్యాట్స్‌మెన్. త‌న రికార్డును ఇప్ప‌టికీ ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు.
 

Unique Cricket Records : క్రికెట్ లో ఇప్ప‌టివ‌ర‌కు వంద‌ల మంది క్రికెట‌ర్లు వ‌చ్చారు. త‌మ అద్భుత‌మైన ఆట‌తో స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ ను అల‌రించారు. అలాగే, క్రికెట్‌లో చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్ వచ్చి పెద్ద రికార్డులు సృష్టించారు. చాలా మంది బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్స‌ర్ల సునామీ బ్యాటింగ్‌తో బౌలర్లలో భయాన్ని, వ‌ణుకును పుట్టించిన వారు ఉన్నారు. 

అయితే టెస్టులో సిక్సర్ కూడా కొట్టకుండానే బౌలర్లను రక్త కన్నీళ్లు పెట్టించిన బ్యాట్స్‌మెన్ కూడా ఒకరు ఉన్నారు. అప్ప‌టి లెజెండ‌రీ బౌల‌ర్లు సైతం అతని వికెట్ తీసుకోవ‌డానికి ప‌డ‌రాన్ని క‌ష్టాలు ప‌డ్డారు. 

అత‌ను బ్యాట్ ప‌ట్టి గోడ‌గా నిల‌బ‌డ‌టంతో 2 రోజుల పాటు ఆస్ట్రేలియన్ నంబర్-1 బౌలర్లు వికెట్ల కోసం అడుక్కుంటూనే ఉన్నారు. 13 గంటల పాటు క్రీజులో ఉండి ఒక టెస్టులో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. త‌మ జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించాడు. అత‌నే ఇంగ్లాండ్ బ్యాట‌ర్ లియోనార్డ్ హట్టన్. 

Latest Videos


1938 సంవ‌త్స‌రంలో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. లియోనార్డ్ హట్టన్ ఓపెనింగ్‌కి వచ్చాడు. ఈ ఇంగ్లండ్ ఆటగాడు బౌండ‌రీలు కొట్ట‌కుండానే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశారు. 

ఆ తర్వాత ఒక్క‌ సిక్సర్ కొట్టకుండానే సెంచరీని కూడా పూర్తి చేశాడు. లియోనార్డ్ ఇక్కడితో ఆగలేదు, సెంచరీ తర్వాత కూడా బౌలర్ల రక్తం పీల్చడం కొనసాగించాడు. వికెట్లు ప‌డ‌కుండా అడ్డుగా నిల‌బ‌డి బౌల‌ర్ల‌కు ప‌రీక్ష పెట్టాడు. 

4-5 గంట‌లు  కాదు ఏకంగా 13 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు లియోనార్డ్ హ‌ట్ట‌న్. ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 86 ఏళ్ల తర్వాత కూడా చెరిగిపోని ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో లియోనార్డ్ 847 బంతులు ఎదుర్కొని 364 పరుగులు చేశాడు.

అత్య‌ధిక బంతులు ఎదుర్కోవ‌డంతో పాటు ట్రిపుల్ సెంచ‌రీ సాధించ‌డంతో ఈ ఇన్నింగ్స్ త‌ర్వాత లియోనార్డ్ పేరు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. 

లియోనార్డ్ హ‌ట్ట‌న్ ట్రిపుల్ సెంచరీ తో ఇంగ్లండ్ జట్టు స్కోరు బోర్డులో 903 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసినా రెండో ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే పరిమితమైంది.

దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 579 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 

click me!