ఈ ఐదుగురు భార‌త స్టార్ ప్లేయర్ల కల చెదిరిపోయింది !

Published : Jan 18, 2025, 10:03 PM IST

champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆడాల‌నుకున్న ఐదుగురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు షాక్ త‌గిలింది.  

PREV
16
ఈ ఐదుగురు భార‌త స్టార్ ప్లేయర్ల కల చెదిరిపోయింది !
Shivam Dube with Indian Team

champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం శ‌నివారం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ)  భారత జట్టును ప్రకటించింది. అయితే, ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆడాల‌నుకున్న 5 మంది ఆటగాళ్ల గుండె పగిలిపోయింది. ఈ 5 మంది ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. 

రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల‌ను మొద‌లుపెట్ట‌నుంది. ఆ తర్వాత మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది. ఆపై మూడో మ్యాచ్ న్యూజిలాండ్‌తో జరుగుతుంది. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఈ టోర్నీకి ఎంపిక కాని ఐదుగురు భార‌త‌ స్టార్ ప్లేయ‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

26
sanju samson

సంజు సామ్సన్ 

భారత జట్టు ప్రకటనకు ముందు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ గురించి పెద్ద చర్చ జరిగింది. జ‌ట్టులో చోటుద‌క్కే అవ‌కాశ‌లు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, సెలెక్టర్లు అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుండి ఔట్ చేశారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్లుగా జట్టులోకి తీసుకున్నారు. సంజూ శాంసన్‌కు సంబంధించి కొన్ని నివేదికల ప్ర‌కారం.. విజయ్ హజారే ట్రోఫీ ఆడనందున అత‌న్ని జట్టులో ఎంపిక చేయ‌లేదని స‌మాచారం.

36

మహ్మద్ సిరాజ్ 

స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్ర‌క‌టించే జ‌ట్టులో ఉంటాడ‌ని అంద‌రూ భావించారు. కానీ, అత‌నికి చోటు ద‌క్క‌లేదు. అత‌ను పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా సిరాజ్ ఫామ్ లో క‌నిపించ‌డం లేదు. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసం ఉంచింది. 

46

శివమ్ దూబే

2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. సెలెక్టర్లు హార్దిక్ పాండ్యా రూపంలో అద్భుతమైన ఆల్ రౌండర్‌ను తీసుకున్నారు. దీని కారణంగా శివమ్ దూబే ఔట్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో దూబే అద్భుత ప్రదర్శన చేసిన సంగ‌తి తెలిసిందే.

56
Image Credit: Getty Images

యుజ్వేంద్ర చాహల్‌

భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను సెలెక్టర్లు మళ్లీ పట్టించుకోలేదు. గత ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చాహల్ టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. అయితే అతనికి ఏ మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు కూడా చాహల్‌కు జట్టులో చోటు దక్కలేదు.

66
Ishan Kishan

ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్ ఇప్పటికీ టీమ్ ఇండియాలోకి రాలేదు. 2023 ప్రపంచకప్ ఆడనున్న ఈ పేలుడు బ్యాట్స్‌మన్, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినా, జట్టులో చోటు దక్కించుకోవడంలో సఫలం కాలేదు. వన్డే ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉండ‌టం గ‌మ‌నార్హం. 

Read more Photos on
click me!

Recommended Stories