ఛాంపియన్స్ ట్రోఫీ 2025: జైస్వాల్, అర్ష్‌దీప్ ఎంట్రీ.. భారత జట్టు ఇదే

Published : Jan 18, 2025, 03:16 PM IST

champions trophy india squad 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌నుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిరాశ‌ప‌రిచే ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత జ‌ట్టులో ఎవ‌రెవ‌రుంటార‌నే ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.  

PREV
15
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: జైస్వాల్, అర్ష్‌దీప్ ఎంట్రీ.. భారత జట్టు ఇదే
Champions Trophy and Team India

champions trophy india squad 2025: ఇటీవ‌లి భార‌త జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ సిరీస్ కోసం ప్ర‌క‌టించే జ‌ట్టులో ఎవ‌రెవరుంటార‌నే ఆసక్తి నెల‌కొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-3 తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో వరుస పరిణామాలు, లీకులు, ఊహాగానాలకు కేంద్ర బిందువుగా మారింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడేందుకు ముందు వీరిద్ద‌రూ ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌ర్వాత వీరిద్దరూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం జట్టును ప్రకటించారు.

25
Image Credit: Getty Images

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 - భార‌త జ‌ట్టు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక కమిటీ శనివారం, జనవరి 18న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించింది.  జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ గాయాల కారణంగా టోర్నమెంట్‌లో పాల్గొంటారా లేదా అనే అనిశ్చితి కారణంగా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జట్టు ప్రకటన వారం రోజులు ఆలస్యమైంది.

అయితే, ఎంతగానో ఎదురుచూస్తున్న 50 ఓవర్ల ICC టోర్నమెంట్ జట్టు ప్రకటనకు BCCI ఎట్టకేలకు ముగింపు పలికింది. ముంబైలోని BCCI ప్రధాన కార్యాలయంలో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు మీడియా సమావేశంలో అధికారికంగా జట్టును వెల్లడించారు.

35

15 మంది సభ్యుల జట్టులో, రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జట్టుకు నాయకత్వం వహిస్తారు కాబట్టి కెప్టెన్సీలో ఎటువంటి మార్పు లేదని ధృవీకరించబడింది. ఈ నెల సిడ్నీ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. ప్రస్తుతం అతను వెన్ను గాయం నుండి కోలుకుంటున్నప్పటికీ జట్టులోకి ఎంపికయ్యాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

45

ఇంగ్లాండ్ సిరీస్ కోసం భార‌త జ‌ట్టు 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రిషబ్ పంత్ రవీంద్ర జడేజా.

ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడనున్నాడు.

55
India vs Australia Test

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించగా, కొత్తగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకున్నారు. మహ్మద్ సిరాజ్ జట్టులో లేడు. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ ఇటీవలి ప్రదర్శనలు దృష్టిలో ఉంచుకుని అత‌నికి జ‌ట్టులోకి తీసుకోలేదు.

Read more Photos on
click me!

Recommended Stories