ఈ మ్యాచ్ సూర్య కుమార్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. సూర్య ఫోర్లు, సిక్సర్లలో శ్రీలంక ఆటగాళ్లు చెమటలు పట్టించాడు. 58 పరుగులతో చెలరేగిన సూర్య కుమార్ చివరకు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడంతో శ్రీలంక బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ సైతం సూపర్ ఇన్నింగ్స్ చెలరేగాడు. జైస్వాల్ 40, గిల్ 34, సూర్య 58, పంత్ 49 పరుగుల ఇన్నింగ్స్ భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 170 పరుగులకు ఆలౌట్ అయింది.