India vs Sri Lanka : శ్రీలంక‌ను చెడుగుడు ఆడుకున్న భార‌త్..

First Published | Jul 27, 2024, 11:48 PM IST

IND Vs SL, 1st T20I Highlights: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భార‌త్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఫుల్ టైమ్ కొత్త కెప్టెన్ గా నియమితులైన సూర్య‌కుమార్ యాద‌వ్ ల‌కు ఇది తొలి సిరీస్ కావ‌డం విశేషం. 
 

Team India , cricket

IND Vs SL, 1st T20I Highlights: శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ విజ‌యంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా శనివారం (జులై 27) పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో భార‌త్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భార‌త క్రికెట్ లో కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, ప్ర‌ధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ల శకం మొదలైంది. ఈ విజ‌యంతో సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా, ఇదే మైదానంలో ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

Yashasvi Jaiswal, India

టీమిండియా ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య‌
 
ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ధాటికి భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 10 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలింగ్‌లో రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. శ్రీలంక తరఫున పాతుమ్ నిస్సాంక 79 పరుగులు, కుశాల్ మెండిస్ 45 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ మినహా మరే బ్యాట్స్‌మెన్‌ కూడా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

Latest Videos


Shubman Gill, India

జైస్వాల్, గిల్ తుఫాను ఇన్నింగ్స్.. 

ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (40 పరుగులు), శుభ్‌మన్ గిల్ (34 పరుగులు) భార‌త్ కు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. గిల్, జైస్వాల్ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేసి శ్రీలంక బౌలర్లను చిత్తు చేశారు. జైస్వాల్ 190.47 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. గిల్  212.50 స్ట్రైక్ రేట్ తో తన 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్ తో 34 ప‌రుగులు చేశాడు. 

Gill, India,

సూర్యకుమార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

గిల్‌, జైస్వాల్ ఔటైన తర్వాత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లు భార‌త స్కోర్ బోర్డును మ‌రింత‌గా ప‌రుగులు పెట్టించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య చాలా దూకుడుగా ఆడాడు. భారత కెప్టెన్ సూర్య‌ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 223.07 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన సూర్యను మతిసా పతిరానా ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియ‌న్ కు పంపాడు. 

Rishabh Pant, India

పంత్ ఫిఫ్టీ  మిస్.. 

సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టిన రిషబ్ పంత్ ఫిఫ్టీ మిస్ అయ్యారు. 33 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్ బాదాడు. పంత్ ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ప్రారంభించాడు, కానీ చివరి ఓవర్లలో వేగం పెంచాడు. దురదృష్టవశాత్తు యాభై పరుగులు చేయలేకపోయాడు. పంత్ పతిరనా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 9 పరుగులు, రియాన్ పరాగ్ 7, రింకూ సింగ్ 1 పరుగుతో ఔటయ్యారు. అక్షర్ పటేల్ 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అర్ష్‌దీప్ సింగ్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక తరఫున పతిరన అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్నాండో, వనిందు హసరంగా తలో వికెట్ తీశారు.

click me!