సఫారీలను చిత్తు చేసిన పాకిస్తాన్... 34 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన నౌమన్...

Published : Jan 29, 2021, 04:18 PM IST

న్యూజిలాండ్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన పాకిస్తాన్‌కి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఊరట విజయం దక్కింది. పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ ఫెయిల్ అయినా ఫవాద్ ఆలం బ్యాటింగ్‌లో నౌమన్ ఆలీ బౌలింగ్‌లో రాణించి, పాక్‌కి విజయాన్ని అందించారు.

PREV
19
సఫారీలను చిత్తు చేసిన పాకిస్తాన్... 34 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన నౌమన్...

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా... మొదటి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇల్గర్ 58 పరుగులు చేయగా జార్జ్ లిండే 35 పరుగులు చేశాడు.

29

స్టార్ ప్లేయర్లు డుప్లిసిస్ 23, డి కాక్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లు యాసిర్ షా 3 వికెట్లు తీయగా షాహీన్ ఆఫ్రిదీ 2, నౌమన్ ఆలీ 2 వికెట్లు పడగొట్టారు.

39

మొదటి ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఫవాద్ ఆలం అద్భుత సెంచరీతో చెలరేగాడు.

49

245 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. అజర్ ఆలీ 51 పరుగులు, ఫహీద్ అష్రఫ్ 64, 11వ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కి వచ్చిన యాసిర్ షా 38 చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాక్...

59

పాకిస్తాన్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన దక్షిణాఫ్రికా 245 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

69

34  ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన నౌమన్ ఆలీ... మొదటి మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు...

79

34 ఏళ్ల 114 రోజుల వయసులో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతూ, ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు నౌమన్ ఆలీ...

89

రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది పాకిస్తాన్...  అజర్ ఆలీ 31 పరుగులు చేయగా బాబర్ ఆజమ్ 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

99

బాబర్ ఆజమ్ జట్టులో ఉండి, అతను 50 పరుగులు కూడా చేయకుండా పాకిస్తాన్ విజయం సాధించడం ఇది మొదటిసారి... 

click me!

Recommended Stories