Nathan Lyon: ఎట్టకేలకు ఆమెనే పెళ్లి చేసుకున్న ఆసీస్ ఆఫ్ స్పిన్నర్..

Published : Jul 24, 2022, 07:46 PM IST

Nathan Lyon wedding: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్  నాథన్ లియాన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఐదేండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న అతడు ఇక ఆ అధ్యాయానికి ముగింపు చెప్పాడు.   

PREV
16
Nathan Lyon: ఎట్టకేలకు ఆమెనే పెళ్లి చేసుకున్న ఆసీస్ ఆఫ్ స్పిన్నర్..

ఆస్ట్రేలియాలో షేన్ వార్న్ తర్వాత  జట్టు స్పిన్ భారాన్ని మోస్తున్న కంగారూ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఎట్టకేలకు 34 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నాడు. జులై 24న అతడు ఐదేండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న తన గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మ మెక్‌కర్తీ నే వివాహం చేసుకున్నాడు. 

26

ఐదేండ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. 2021 లో  ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.  అయితే మధ్యలో లయాన్ బిజీగా గడపడంతో అతడి పెళ్లి వాయిదాపడుతూ వచ్చింది. ఇటీవలే లంక పర్యటన ముగించుకున్న లియాన్.. స్వదేశం వెళ్లగానే ఆ తంతును పూర్తి చేశాడు. 

36

2017 నుంచి లియాన్- ఎమ్మ ప్రేమలో ఉన్నారు.తాజాగా  పెళ్లి ఇరుపక్షాల కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ మేరకు లియాన్.. ఎమ్మతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశాడు. 

46

తెల్ల రంగు వెడ్డింగ్ గౌన్ ధరించిన ఎమ్మ.. నలుపు ప్యాంట్, షర్ట్ వేసుకున్న లియాన్ లు  కొండలా ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లి ఫోటో షూట్ చేసుకన్నట్టు అతడు తాజాగా షేర్ చేసిన ఫోటోను చూస్తే తెలుస్తున్నది. లియాన్ కు ఆస్ట్రేలియా క్రికెటర్లు సీన్ అబాట్, బ్రెట్ లీ, పీటర్ సిడిల్ లు శుభాకాంక్షలు తెలిపారు. అతడి దాంపత్య జీవితం సుఖవంతంగా సాగాలిన వాళ్లు ఆకాంక్షించారు. 

56

పరిమిత ఓవర్ల క్రికెట్ లో అంతగా ఆడకున్నా ఆస్ట్రేలియా ఆడే టెస్టులలో మాత్రం లియాన్ ఉండాల్సిందే. ఇక వార్న్ తర్వాత అక్కడ అత్యధిక వికెట్లు (స్పిన్నర్లలో) తీసిన బౌలర్ గా లియాన్ గుర్తింపులకెక్కాడు.  

66

34 ఏండ్ల లియాన్..ఇటీవల ముగిసిన లంకతో సిరీస్ లో మెరుగ్గా రాణించాడు. ప్రస్తుతం అతడు  438 వికెట్లతో టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

click me!

Recommended Stories