వాన వస్తుందంటే రైతులు సంతోషిస్తారు. ఎండలతో విసిరి వేసారిన పట్టణ ప్రజలు కూడా వర్షపు జల్లుల పలకరింపులకు పులకరించిపోతారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం వర్షం ఎప్పుడూ శత్రువే. క్రికెట్ మ్యాచ్‌ని ఎంజాయ్ చేద్దామని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తాడు వరుణుడు. ముఖ్యంగా టీమిండియాకి వర్షం... ఓ బద్ధ శత్రువుగా తయారైంది...
తొలి రెండు మ్యాచుల్లో ఓటమి తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి విజయోత్సహంతో ఆఖరి టీ20 మ్యాచ్ గెలిచి, సిరీస్ సొంతం చేసుకోవాలనుకున్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా ఆఖరి టీ20 రద్దు కావడంతో సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.
212
ఐసీసీ టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీస్‌ల దాకా చాలా సందర్భాల్లో టీమిండియా విజయాలను అడ్డుకున్నాడు వరుణుడు. 2003 వన్డే వరల్డ్ కప్ నుంచి టీమిండియాకి, వరుణుడికి మధ్య ఓ కనిపించిన వైరం కొనసాగుతూ వస్తోంది...
312
Image credit: PTI
2003 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన గంగూలీ టీమ్, అసాధారణ విజయాలతో ఫైనల్‌కి ప్రవేశించి, హాట్ ఫెవరెట్ టీమ్స్‌కి షాక్ ఇచ్చింది...
412
అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ అజేయ సెంచరీ కారణంగా 359 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా సహకరిస్తున్న పిచ్‌పై ఈ లక్ష్యాన్ని టీమిండియా సులువుగా ఛేదిస్తుందని భావించారంతా...
512
అయితే తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షపు చినుకులు కురవడంతో మ్యాచ్‌కి కాసేపు అంతరాయం కలిగింది. బ్రేక్ చిన్నదే అయినా వర్షం పడి పిచ్ తడవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తేమ కారణంగా పిచ్ బౌన్సీగా మారడంతో భారత బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్‌కి క్యూ కట్టారు. ఫలితంగా భారత జట్టు 234 పరుగులకి కుప్పకూలి 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
612
2019 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో అద్భుత విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టింది టీమిండియా. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది. ఫలితం న్యూజిలాండ్ చేతుల్లో 14 పరుగుల తేడాతో ఓడి, సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది టీమిండియా...
712
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో రోజు కూడా వర్షం అంతరాయం తప్పలేదు. ఉదయం నుంచి ఎలాంటి వర్ష సూచనలు లేకుండా కనిపించిన సౌంతిప్టన్‌లో సరిగా మ్యాచ్ సమయానికి చినుకులు పలకరించాయి... భారత జట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు ఆకాశం మేఘావృత్తమై, వర్షపు జల్లులతో చికాకు పెట్టించాడు వానదేవుడు. దీంతో టీమిండియా క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసింది.
812
న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే సమయాల్లో మాత్రం ఆకాశంలో మేఘాలు తొలిగిపోయి, చక్కగా ఎండకాచేది. వర్షం కారణంగా ఒక్కటిన్నర రోజుల ఆట రద్దయిన ఆరు రోజుల పాటు సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాని ఓడించిన న్యూజిలాండ్, 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచింది...
912
2021 ఇంగ్లాండ్ పర్యటనలో ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు వరుణుడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి రోజు భారత జట్టు విజయానికి 157 పరుగులు కావాల్సి వచ్చాయి. చేతిలో 9 వికెట్లు ఉండడంతో టీమిండియా ఘన విజయం సాధించి, బోణీ కొట్టడం దాదాపు ఆనవాయితీయే అనుకున్నారంతా...
1012
Team India vs england trent bridge test 1st innings
అయితే ఎడతెడపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఐదో రోజు ఆటను రద్దు చేసి, మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు అంపైర్లు. డ్రాగా ముగిసినట్టు ప్రకటించిన తర్వాత వర్షం నిలిచిపోయి, ట్రెంట్ బ్రిడ్జిలో ఎండ రావడం విశేషం. ఈ మ్యాచ్ సజావుగా సాగి ఉంటే ఇప్పటికే భారత జట్టు 3-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచి ఉండేది...
1112
సౌతాఫ్రికాను స్వదేశంలో ఓడించి, సఫారీ టూర్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది భారత జట్టు. అయితే ఈ సారి కూడా వరుణుడు, టీమిండియా విజయాన్ని అడ్డుకున్నాడు. ఇంతకుముందు 2019లో భారత్ పర్యటించిన వచ్చిన సమయంలోనూ సౌతాఫ్రికాని పరాభవం నుంచి కాపాడింది వర్షం... 2019లో ధర్మశాలలో జరగాల్సిన టీ20, వర్షం కారణంగా రద్దయ్యింది...
1212
Rain Match
టీమిండియాపై తెలియని కక్ష, పగ పెంచుకున్న వరుణుడు... ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడని అంటున్నారు నెటిజన్లు. భారత జట్టును వెంటాడుతున్న వాన గండం ఎప్పటికి తొలిగిపోతుందోనని కంగారుపడుతున్నారు మరికొందరు అభిమానులు..