ఆ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ దాకా నాకు బౌలింగ్ ఇవ్వలేదు, అందుకే... 1993 హీరో కప్ మ్యాచ్‌పై సచిన్ టెండూల్కర్...

First Published Nov 26, 2021, 11:57 AM IST

బ్యాటుతో నూరు శతకాలు బాది, ‘క్రికెట్ గాడ్’ గుర్తింపు తెచ్చుకున్న భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌, బంతితోనూ అద్భుతంగా రాణించాడు.. వన్డేల్లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన సచిన్, బెస్ట్ బౌలింగ్‌ అంటే మాత్రం 1993 హీరో కప్ టోర్నీ సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాపైనే...

1993 హీరో కప్ సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. లో స్కోరింగ్ గేమ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది భారత జట్టు...

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 195 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 118 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 పరుగులు చేయగా ప్రవీణ్ అమ్రే 48 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

సచిన్ టెండూల్కర్ 15, అజయ్ జడేజా 6, వినోద్ కాంబ్లీ 4, కపిల్ దేవ్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు...

196 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికాకి అన్రూ హెడ్‌సెన్ 62, బ్రియాన్ మెక్‌మిలాన్ 48 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. 49 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది సౌతాఫ్రికా...

ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా విజయానికి 6 పరుగులు కావాల్సిన దశలో బంతిని అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఇన్నింగ్స్ 50వ ఓవర్‌ దాకా సచిన్ టెండూల్కర్ ఒక్క ఓవర్ కూడా వేయకపోవడం విశేషం...

‘ఆ మ్యాచ్‌లో 50వ ఓవర్ దాకా నేను బౌలింగ్ చేయలేదు. ఒక్క బంతి కూడా వేయలేదు. నా బాడీ స్టిఫ్‌గా ఉంటుంది, నా వేళ్లు కూడా. అందుకే తడిగా ఉన్న బంతిని ఎలా వేస్తానోనని నాకు బౌలింగ్ ఇవ్వలేదు...

అందుకే ఆఖరి ఓవర్‌లో బంతిని తీసుకున్న తర్వాత చాలాసేపు వార్మప్ చేశాను. మిడిల్ ఓవర్లలో అజారుద్దీన్‌కి నేను బౌలింగ్ చేస్తానని చెప్పాను...

అయితే ఆఖరి ఓవర్ దాకా నాకు బౌలింగ్ ఇవ్వలేదు. లాస్ట్ ఓవర్‌ వేస్తావా? అని అడిగాడు. నువ్వు వేయమంటే వేస్తానని చెప్పా... ఆ తర్వాత బౌలింగ్ మొదలయ్యాక నా వేళ్లతో బంతిని తిప్పడం మొదలెట్టా...

చాలా సేపటి తర్వాత నాకు బంతిపై గ్రిప్ దొరికినట్టు అనిపించింది. ప్రతీ పరుగు ఎంతో అమూల్యమైనది. నా డాట్ బాల్ వేసిన ప్రతీసారీ, స్టేడియంలో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు...

ప్రేక్షకులు చేసిన గోల, ప్రోత్సాహం కూడా నా బౌలింగ్‌కి హెల్ప్ అయ్యాయి. అది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తడికి లోనయ్యేలా చేశాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్...

1993 హీరో కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 2 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని, టైటిల్ కైవసం చేసుకుంది...

click me!