లాలా అమర్‌నాథ్ నుంచి శ్రేయాస్ అయ్యర్ దాకా... ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీలు చేసిన వీరులు వీరే...

First Published Nov 26, 2021, 11:11 AM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ పేరు చూసి, ఇతన్ని ఎందుకు ఎంపిక చేశారని అనుకున్నారందరూ. ఫామ్‌లో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను పక్కనబెట్టి, అయ్యర్‌కి తొలి టెస్టులో అవకాశం ఇవ్వడంపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే వాటన్నింటికీ తన ఇన్నింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు శ్రేయాస్ అయ్యర్...

ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి ఆకట్టుకుని, 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్...

అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్లు త్వరగా అవుట్ కావడంతో 145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 300+ స్కోరు చేయడానికి అయ్యర్ ఇన్నింగ్సే కారణం...

ఓవరాల్‌గా ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ కాగా, స్వదేశంలో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్...

1933లో లాలా అమర్‌నాథ్, తన తొలి టెస్టులో సెంచరీ చేసి... టీమిండియా తరుపున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచారు...

1952లో ఎంట్రీ టెస్టులోనే సెంచరీ చేసిన దీపక్ శోధన్, స్వాతంత్య్ర  భారతంలో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

1955లో ఏజీ కృపిల్ సింగ్, 1959లో అబ్బాస్ ఆలీ, 1964లో హనుమంత్ సింగ్, 1969లో గుండప్ప విశ్వనాథ్, 1976లో సురీందర్ అమర్‌నాథ్ ఈ ఫీట్ సాధించారు...

1984లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అజారుద్దీన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయగా, 1992లో ప్రవీణ్ అమ్రే, 1996లో సౌరవ్ గంగూలీ, 2001లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించారు...

2000వ సంవత్సరం దాటిన తర్వాత సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌ కాగా, ఆ తర్వాత 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు....

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లీగ్‌లో ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు క్రియేట్ చేశాడు. 2019-21 సీజన్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు...

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 1955లో కృపిల్ సింగ్, 1964లో హనుమంత్ సింగ్, 1984లో మహ్మద్ అజారుద్దీన్, 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2018లో పృథ్వీషా... అయ్యర్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు...

నెం.5లో ఆరంగ్రేటం చేసి, సెంచరీ చేసిన నాలుగో భారత ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. వేరే ఏ ఇతర దేశంలోనూ ముగ్గురూ కూడా ఈ ఫీట్ సాధించలేకపోవడం విశేషం... 

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లోనే ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 1969లో ఆస్ట్రేలియాపై గుండప్ప విశ్వనాథ్ ఈ ఫీట్ సాధించాడు...

click me!