ఆ కారణంగానే ఆ జట్టు నుంచి బయటికి శ్రేయాస్ అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

First Published Nov 26, 2021, 9:53 AM IST

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. 13 ఏళ్లుగా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయిన ఢిల్లీని, తొలిసారి ఆఖరాటకు చేర్చిన కెప్టెన్ కూడా శ్రేయాస్ అయ్యరే... అయితే అయ్యర్‌ను అట్టిపెట్టుకోవడం లేదని ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్...

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ప్లేయర్ల జాబితాను ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. పాత ఫ్రాంఛైజీలకు నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, 2021 సీజన్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు, పృథ్వీషా, అక్షర్ పటేల్, అన్రీచ్ నోకియాలను రిటైన్ చేసుకోబోతున్నట్టు సమాచారం...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్ పేరు, రిటెన్షన్ జాబితాలో లేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది...

అయితే వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికి రావాలని స్వయంగా శ్రేయాస్ అయ్యర్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం కెప్టెన్సీయే...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, 2021 సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు...

శ్రేయాస్ అయ్యర్ చేతికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, మూడు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఐపీఎల్‌ 2021 సీజన్ ఫస్టాఫ్‌‌లో అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ దక్కింది...

శ్రేయాస్ అయ్యర్ కంటే దూకుడుగా జట్టును నడిపించిన రిషబ్ పంత్ కెప్టెన్సీకి టీమ్ మేనేజ్‌మెంట్ బాగా ఇంప్రెస్ అయ్యింది. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ సమయానికి శ్రేయాస్ అయ్యర్ కోలుకుని, జట్టుకి అందుబాటులోకి వచ్చినా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది...

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉండాలని భావించిన శ్రేయాస్ అయ్యర్‌, ఐపీఎల్‌లో కెప్టెన్సీ పోవడంతో బాగా హర్ట్ అయ్యాడని, అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అహ్మదాబాద్, లక్నో వంటి రెండు కొత్త ఫ్రాంఛైజీలు రాబోతున్నాయి. ఈ రెండు జట్లలో ఓ టీమ్‌కి కెప్టెన్‌గా వెళ్లాలని శ్రేయాస్ అయ్యర్ భావిస్తున్నాడట...

అలాగే పంజాబ్ కింగ్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లకి కెప్టెన్లు లేరు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు... కాబట్టి ఏదో ఒక టీమ్‌కి సారథిగా రాణించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట అయ్యర్...

click me!