Fastest Century In IPL
Fastest Century In IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ప్లేయర్లలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ టాప్ లో ఉన్నాడు.
1. క్రిస్ గేల్
గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ. గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న సమయంలో ఏప్రిల్ 23, 2013లో పూణే వారియర్స్ (PWI) తో జరిగిన మ్యాచ్ లో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయేలా దంచికొట్టాడు. గేల్ 175* పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 130 పరుగుల తేడాతో గెలిచింది.
Yusuf Pathan scores the second fastest century in IPL
2. యూసుఫ్ పఠాన్
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది భారత స్టార్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్. అతను కేవలం 37 బంతుల్లో సెంచరీ బాదాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున బరిలోకి దిగి పఠాన్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. మార్చి 13, 2010 జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) 4 పరుగుల తేడాతో గెలిచింది. పఠాన్ ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్థాన్ కు గెలుపు అందించలేకపోయినా అభిమానుల్ని అలరించింది.
David Miller scores the third fastest century in IPL
3. డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ డేవిడ్ మిల్లర్. ఈ సౌతాఫ్రికా స్టార్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై కేవలం 38 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ తో పంజాబ్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఇన్నింగ్స్ తోనే డేవిడ్ మిల్లర్ "కిల్లర్ మిల్లర్" గా గుర్తింపు పొందాడు.
Travis Head scores fourth fastest century in IPL
4. ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచరీని బాదాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న హెడ్ గతేడాది ఏప్రిల్ 15, 2024న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సూపర్ నాక్ ఆడాడు. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో హైదరబాద్ టీమ్ 25 పరుగుల తేడాతో గెలిచింది.
Priyansh Arya scores the fifth fastest century in IPL
5. ప్రియాంష్ ఆర్య
ఐపీఎల్ లో 5వ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య. ఈ ఏడాది ఏప్రిల్ 8న అతను పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున ఓపెనింగ్ బ్యాటర్ గా గ్రౌండ్ లోకి వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ ను ఊతికిపారేశాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ముల్లన్‌పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ప్రియంష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ తో పంజాబ్ టీమ్ 18 పరుగుల తేడాతో తెలిచింది.