Virat Kohli, RohitSharma
Cricket Records-Joe Root : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ టాప్-5 లిస్టులో భారత క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఆధునిక క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ కూడా చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు కొత్త రికార్డులను కోహ్లీ సృష్టించాడు. గ్రౌండ్ ఏదైనా సరే పరుగుల వరద పారిస్తూ క్రికెట్ రన్ మిషన్ గా గుర్తింపు సాధించాడు.
అయితే, ప్రస్తుతం క్రికెట్ లో విరాట్ కోహ్లీ రన్ మిషన్ హోదా తగ్గిపోతోంది. అది మరో స్టార్ ప్లేయర్ ఆట కారణంగా. కేవలం రెండు సంవత్సరాలలో ఏకంగా 17 సెంచరీలు బాది సరికొత్త రికార్డు సృష్టిస్తూ పరుగుల వరద పారించడంతో విరాట్ కోహ్లీ రన్ మిషన్ హోదా ఈ ప్లేయర్ చేతిలోకి చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి.
సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసే దిశగా జోరూట్
అతనే ఇంగ్లాండ్ లెజెండరీ ప్లేయర్ జో రూట్. ప్రస్తుతం అతని క్రికెట్ కెరీర్ అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతో క్రికెట్ రికార్డులు బద్దలు కొడుతూ దిగ్గజ ప్లేయర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతున్నాడు. గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్ లో జో రూట్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం జో రూట్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టులో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. మ్యాచ్ గెలవడానికి శ్రీలంక బౌలర్లు అతని వికెట్ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడిన జోరూట్ అద్భుతమైన యావరేజ్‌తో దూసుకుపోతున్నాడు.
ఈ సిరీస్ లో జో రూట్ 116.66 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇందులో 143 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఉంది. మూడో, చివరి టెస్టు సెప్టెంబర్ 6న ఓవల్‌లో జరగనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జో రూట్‌పైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కేవలం రెండేళ్లలో 15 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు జోరూట్. జో రూట్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ పేర్లు టెస్టు ఫార్మాట్‌లో ఫ్యాబ్-4 జాబితాలో ఉన్నాయి. అంటే ప్రస్తుత టెస్టు క్రికెట్ లో టాప్-4 బ్యాటర్లు. వీరి మధ్య ప్రస్తుతం గట్టి పోటీ నెలకొంది.
ఫ్యాబ్-4 ను వెనక్కి నెట్టిన జోరూట్
అయితే ప్రస్తుతం డిఫరెంట్ మూడ్ లో ఉన్న జో రూట్ గత రెండేళ్లుగా ఈ ముగ్గురి ప్లేయర్లు వెనక్కినెడుతూనే ఉన్నాడు. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత రెండేళ్లలో జో రూట్ 15 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.
2020 వరకు రూట్ 17 సెంచరీలతో ఫాబ్-4లో అట్టడుగు స్థానంలో ఉన్నాడు. కానీ దీని తర్వాత వరుస సెంచరీలతో టెస్టు క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించాడు. అనేక రికార్డులు సాధించాడు. ఈ 2 సంవత్సరాలలో అద్భుతమైన ఆటతో ఇప్పుడు 34 సెంచరీలకు చేరుకున్నాడు.
గత రెండేళ్లలో జో రూట్ తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు. వీటిలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించడం అతని కెరీర్ లో అతిపెద్ద అచీవ్‌మెంట్. అలిస్టర్ కుక్ (33 సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టాడు.
జో రూట్ ఇప్పటివరకు 145 టెస్టులు ఆడాడు, అందులో 34 సెంచరీల సహాయంతో 12377 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5లో చోటు దక్కించుకోవడానికి జో రూట్ కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు.
ఇక టెస్టు క్రికెట్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన రికార్డును లెజెండరీ బ్యాటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ టెస్టు క్రికెట్ లో 15921 పరుగలు చేశాడు. 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు.